Rayavaram Munsiff Sri Vundavilli Satyanarayana Murthy :
Sri Vundavilli Satyanarayana Murthy Popularly known as Rayavaram Munsiff is one of the old guards of the congress and is well known to one and all in the state of Andhra Pradesh. The services rendered to the public by sri VSM in the capacity of M.L.C, APCC treasurer, AICC member, Chairman of East Godavari Zilla Parishad,President of Ramachandrapuram co-operative central bank and last but not least as Founder, President and Correspondent of VSM College, Ramachandrapuram, East Godavari Dt.are exemplary and noteworthy.
కళాశాల అధ్యాపక తదితర సిబ్బంది కృతజ్ఞతా పూర్వకంగా
కళాశాల ప్రాంగణంలో నెలకొల్పిన మునసబు గారి కాంశ్య విగ్రహం
నేనెరిగిన శ్రీ రాయవరం మునసబుగారు
రచన: ఆచార్య తూమాటి దొణప్ప
(ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయ ఉప కులపతి(పూర్వ))
ప్రజలలో పెరిగి, ప్రజల నడుమ తిరిగి, ప్రజల మనస్సున కెక్కి పదస్థులయిన దేశనాయకులలో రాయవరం మునసబుగారొకరు. ఉత్తమ నాయక లక్షణ లక్షితులయినవారు మాత్రమే స్వీకరించగల బహుతర ప్రయాస గమ్యమైన మార్గమది. రామచంద్రపురం కళాశాలకు పునర్నామకరణం జరిగేదాకా వారి అసలు పేరు నాకు తెలియదు. పేరులో ఏముంది? వట్టి గొప్పలు చెప్పుకోకుండా ‘పూనియేదయినాను ఒక మేలు’ చేసి చూపిన సేవానిష్ఠులే మనకు మాన్యులు; వారే మహనీయులు.
ప్రజా రంగంలో పనిచేసే యే వ్యక్తికయినా ధైర్యస్థైర్యాలు అత్యావశ్యక గుణాలు. ‘స్థైర్యం స్వధర్మాద చలనమ్ - ధైర్యమింద్రియ నిగ్రహః’ తాను నమ్మిన ధర్మపధం నుంచి వైదొలగకుండా ఉండటం స్థైర్యం; ఇంద్రియ చాపల్యానికి లొంగకుండా ఉండటం ధైర్యం అని వ్యాస వచనం. ఈ ధైర్య స్థైర్యాలు మునసబు గారికి సహజ కవచాల వంటివి. ధృతవ్రతమే ఆయనకు దృఢవ్రతం. మిన్ను విరిగి మీదపడ్డా చలించని మేరు ధీరులు ఆయన.
చదువులు సంస్కారానికీ, పదవులు పరోపకారానికీ భూమికలని మనసార నమ్మి, నోరార చెప్పి, చేయార చేసి చూపిన విచక్షుణులు మునసబుగారు. మనసులో ఒకటీ, మాటలో మరొకటీ ఆయనకు అలవాటులేని విద్యలు. అందువల్లనే పదవీప్రలోభాలకీ, ప్రజారంగ ప్రలాభాలకీ అతీతులుగాను, అధికార దాహాలకీ, అవకాశవాద వ్యామోహాలకీ అనాసక్తులుగానూ ఉంటూ వచ్చిన వీరి అసాధారణ వ్యక్తిత్వం అజేయం,జగజ్జేయం. ఆయన అచ్చంగా కార్యశూరులేగాని, వాచా శూరులుగారు. మిధ్యావాదాలు, రధ్యా ప్రసంగాలు, వృధా చర్చలు ససేమిరా ఆయనకి నచ్చవు. ఆయన నూటికి నూరుపాళ్ళూ కార్యవాది.
అనేక రాజకీయ యుద్ధాలలో ఆరితేరిన వృద్ధమూర్తులయినప్పటికీ, మునసబుగారు అంతర్ముఘులు. ఆశ్రితజనరక్షా దీక్షాదక్షులయినప్పటికీ గుణపక్షపాతులు.
రాజకీయ స్వాతంత్ర్యం సంపూర్ణస్వాతంత్ర్యసౌధానికి ఒక సోపానం మాత్రమే అని మునసబుగారి విశ్వాసం. ఆర్ధిక సహకారరంగాలు దేశప్రగతికి వెన్నెముక వంటివనీ, విద్యావ్యవసాయ రంగాలు జాతి సుస్థితికి ఆయువుపట్టులవంటివనీ మునసబుగారు నిర్దేశించుకోవడం ఆయన క్రాంతదర్శిత్వానికీ, క్రాంతిదృక్పధానికీ సూచికలు. అందుచేత ఈ రంగాలపై తమ దృష్టిని కేంద్రీకరించి, అసహాయ శూరులుగా, ఏకాంగి వీరులుగా పరిశ్రమించారు. రామచంద్రపురం కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ , రామచంద్రపురం కళాశాల, తుల్యభాగాలిఫ్ట్ యిరిగేషన్ పధకం, వీరి విశిష్టదృష్టికీ,వివేక పరిపాకానికీ చక్కటి నిదర్శనాలు.
లక్ష్యసంసిద్ధికి సాధన సామాగ్రి సంశుద్ధీ, కార్యనిర్వహణ దృఢబుద్ధీ అత్యవసరాలని గుర్తించినందువల్లనే మునసబుగారు చేపట్టిన అన్ని రంగాలు మూడుపువ్వులూ, ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నాయి.
వెరసి: మునసబుగారు మంచికి మారుపేరు; మన్ననకి మరోపేరు.
విద్యాదానకర్ణులు, వితరణ కళాప్రపూర్ణులు అయిన శ్రీ వుండవిల్లి సత్యనారాయణమూర్తిగారి షష్టిపూర్త్యుత్సవాలు సాధుజన సంతుష్టికీ, సత్సంప్రదాయ పరిపుష్టికీ దోహదం కాగలవని మా విశ్వాసం.
(సేకరణ : శ్రీ వుండవిల్లి సత్యనారాయణమూర్తిగారి షష్టిపూర్తి సన్మాన సంచిక-1976)
" ప్రజల మనిషి "
రచన : కొత్త కమలాకరం |
సామాన్య ప్రజల శ్రేయస్సే తమ శ్రేయస్సుగా భావించి , అహోరాత్రులు వారికై శ్రమచేసి , ప్రజల్లో శాశ్వత ముద్ర వేసుకుంటారు కొద్దిమంది ..
తమిళుల కామరాజు , ఆంధ్రుల ప్రకాశం పంతులు, ఆచార్య రంగా వంటివారు ...ఇట్టివారు చాల అరుదుగా వుంటారు.
వీరి శ్రేణిలో చేర్చవలసిన వ్యక్తి , ప్రజల మనిషిగా గుర్తింపబడిన వ్యక్తి మన సత్యమూర్తి.
డిగ్రీలు లేవు..పెద్ద పదవులు అసలే లేవు..జమీలు లేవు..
మరి ఏమిటి? ఈ "మూర్తి "లో ఇంతటి దివ్య శక్తి ఏవిధంగా చోటు చేసుకుంది?
పేద ప్రజల దీన హృదయాలు ఈమధ్యకాలంలో ప్రభుత్వమూ, మన నాయకులూ గుర్తించి వారి శ్రేయస్సుకై పాటుపడటం మనం చూస్తున్నాం..
ఈ విషయం మన సత్యమూర్తి తన చిన్న వయస్సు లోనే గుర్తించి,వారి శ్రేయస్సుకై పాటు పడటం ఒక్క కారణంగా భావించవచ్చు .
ఈ మధ్యకాలంలో తయారయిన నాయకుల్లాగా కాకుండా,గాంధీజీ ప్రభావంతో స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని, క్రమశిక్షణ చిన్నవయస్సు లోనె అలవచ్చుకున్న" మూర్తి "అవడం మరొక కారణం...
డిగ్రీలు లేకున్నా, అనుభవంలో కష్టసుఖాల నెదుర్కోటంలో, అనుకొన్నది సాధించటంలో పట్టుదల , దీక్ష కలిగి నీతినిజాయిగా వ్యవహరించడం వలన , వ్యక్తికి కావలసిన సంస్కారం అలవర్చుకోవడం వలన ..చాల మంది
విద్యాధికుల్లో కానరాని "మంచి మూర్తిని "మనం ఈ సత్యమూర్తిలో చూడగలగడం మరొక కారణం .....
జమీలు లేవు..పుట్ల కొద్దీ ధనం లేదు.. ఈ ప్రాంతపు రాజకేయాల్లో ముందు నిలబడేది డబ్బే....అందరుజమిందారులూ ఈయనకు ఎదురే.. మరి ఎలా ఎదుర్కొన్నారు? ప్రజల మనిషికి ధన బలం అక్కర లేదని నిరూపించారు మన సత్య మూర్తి.. ఏ వైనా శాశ్వతంగా నిలిచే పనులు చేసారా? ఎన్నో చేసారు...
ప్రాధమిక విద్యావ్యాప్తికై కృషి చేశారు..స్వగ్రామంలో తన డబ్బు తో ఉన్నత పాఠశాల స్థాపించారు... తదుపరి ఉన్నత విద్యావికాసానికి పాటు పడ్డారు... చివరకు గొదావరి జిల్లాలో ఏ ప్రయివేటు అనుబంధ కళాశాలలో లేని ఎమ్.ఎ క్లాసుని కూడ ప్రప్రధమంగా తన కళాశాల లో ఏర్పాటు చేశారు.. డిగ్రీలు లేని వ్యక్తి , ఉన్నతాధికారుల్లో , ఉన్నత విద్యావంతుల్లో ఎంత గౌరవం ,ఎంత ప్రేమాభిమానాలను సంపాదించారంటే.. సత్యమూర్తి తలుస్తే..సత్యమూర్తి కోరితే..ఆపని కార్యరూపం లోకి వెనువెంటనే రావడం దానికి నిదర్శనం.. ఎందరో కళాశాలలు స్థాపించారు..పంతుళ్ళపై కర్ర పెత్తనం చలాయించారు..కళాశాల అభివృధ్ది, అధ్యాపకుల శ్రేయస్సుకై పాటుపడిన వ్యక్తులు చాల తక్కువ మందిని మనం చూస్తాము.కాని ఈయనో ...... ఒక ఉత్తమ సంస్కారవంతుడు , విద్యాధికుడైన డాక్టర్ గరిగిపాటి రుద్రయ్య చౌదరి పై ఈ కార్యభారం మోపి , తన పర్యవేక్షణలో తీర్చిదిద్దుతూ , దాక్షారామ దేవాలయం తర్వాత ఈప్రాంతంలో ప్రతివారూ దర్శింప దగిన ఒక పవిత్ర ప్రాంగణంగా , ఒక అందమైన ప్రదేశంగా తీర్చిదిద్ది , కళా,సాహిత్య , క్రీడా రంగాలకు నిలయంగా,
ఒక ప్రత్యేకతను సాధించేటట్లుగా ఈ విద్యాసంస్థనుతీర్చిదిద్దడం జరిగింది. దరిదాపు పదేళ్ళుగా ఈయన కళాశాలలో పనిచేసే అధ్యాపకులను కూడా ఆయన ఎరుగరు..వ్యక్తులుగా ఆయనకు పరిచయం లేదు..తన వద్ద పనిచేసే వాళ్ళ స్తోత్రపాఠాలు ఎరుగరు...ఏమిటీ ఈ అమాయకుడు? నిజమే..తమ కళాశాల అధ్యాపకులందరి శ్రేయస్సే ఆయన ఆశించేది.. అంతే గాని వ్యక్తులది కాదు.. ఇచట అధ్యాపకులకు ..సత్యమూర్తికి గల సంబంధం , మరి ఏ ఇతర కళాశాలలో కూడా చూడడం జరగదంటే అది అతిశయోక్తి ఏమాత్రం కాదు. నూలు మిల్లు స్థాపించాడు.. చేనేత రంగానికి సేవ చేసాడు..
సహకార రంగంలో ఎంతొ శ్రమ చేశాడు.. బలహీన వర్గాలకై పాటు పడ్డాడు.. హరిజన గిరిజన ఉద్దరణకై అహర్నిశలు శ్రమపడ్డాడు.. ఏజన్సీలో సత్యమూర్తి పేరు తెలియని పులిపిల్ల కూడా ఉండదేమో? రైతులకు, రైతుకూలీలకు అండగానున్నాడు..ఇన్ని సంపదలున్న మనిషికి ........ ధన సంపద ఎందుకు?
డిగ్రీ చదువులెందుకు? పదవులెందుకు? రాణించడానికి...కీర్తించబడటానికి...చిరకాలం గుర్తింపబడటానికి...
సత్యమూర్తి లో ఒక కామరాజును చూడ వచ్చు... ఒక ప్రకాశంపంతుల్ని దర్శింపవచ్చు... ఒక రంగాను గుర్తింపవచ్చు... ఇందిరమ్మ ఆర్ధిక ప్రణాళికను అవలోకింపవచ్చు...ప్రజల మనిషికి ఎదురుండదని నిరూపించవచ్చు..
వుండవిల్లి సత్యనారాయణ మూర్తి (రాయవరం మున్సబు) షష్టిపూర్తి సంచిక నుండి .....
*********************************************
Sri VUNDAVILLI SATYANARAYANA MURTHY:
Ramachandrapuram taluk is a very fertile region with a very
affluent political cultural and agricultural elite but still it was
lacking an ordinary eminity like a college till the year 1966.
It is an irony that a man who had not the benefit of even
high school education should come forward with the noble
idea of starting an institution for higher education and
organise the educational society in 1965 and himself make
a mighty contribution and collect funds night and day and
turn out the miracle of starting one of the finest colleges
in the district .It is probably the result of an insatiable
urge and a noble impulse to give and afford to others
what is denied to him .
What is done by him is not a mean contribution to the
welfare of the taluk and its thousands of youth most of
whom would have gone without the benefit of
college education .They will forever remember
him as a patron of higher education in this area.
The taluk is forever indebted to him for this noble act
if not for his other welfare activities which resulted
in the starting of a High School in his father's name
and a Veterinary Hospital in his mother's name
and a Lift irrigation scheme to facilitate perpetual
second crop irrigation in a vast area not to speak
of several other public welfare activities with which
he is associated in his public life in various branches of
activity;political and social.True to the letter he is a
PEOPLE'S REPRESENTATIVE.
He is always work minded and moves shant like
an ethereal spirit to attend to the various problems
of the people mostly the havenots of his region .
He is a dynamic personality always smart cheerful
and optimistic. In the fitness of things the college at
Ramachandrapuram which is his making is rightly
named after him and he will be ever remembered
in this taluk as the Founder and Builder of this
great institution which has recently risen to the
dimensions of a POST GRADUATE CENTRE.
- K.V. RAMANAYYA , Advocate
Ramachandrapuram
(source: vsm college magazine)
********************************************
శ్రీమతి ఇందిరాగాంధీ, కాసు బ్రహ్మానంద రెడ్డి గారలతో
రాయవరం మునసబు గారు
మునసబు గారి కన్న తల్లి దండ్రులు-
శ్రీమతి రిమ్మలపూడి సూరమ్మ,శ్రీ నారాయణ మూర్తి
మునసబు గారి దత్తత తల్లి దండ్రులు-
శ్రీమతి వుండవిల్లి చెల్లయ్యమ్మ, శ్రీ రామయ్య
ముత్యాల మంగమ్మగారు (మునసబు గారి అత్త గారు )
మునసబు గారి భార్య శ్రీమతి రామతులశమ్మ
**************************************************
మునసబుగారి షష్టిపూర్త్యుత్సవ ఆహ్వాన సంఘం
అద్యక్షుడుగా ఎస్.ఆర్.ఎమ్.టి చైర్మెన్ శ్రీ కె.వి.ఆర్. చౌదరి
ఎస్.ఆర్.ఎమ్.టి చైర్మెన్ శ్రీ కె.వి.ఆర్. చౌదరి కళాశాలకు
నూతన బస్సును బహూకరించిన సందర్భంగా..
****************************************************
Our college is a spark-house of knowledge and wisdom with Computer Applications and a fountain of Information Systems. The college offers a number of courses at U.G. & P.G. levels attaining the status of a Mini-University. It welcomes the zealous juvenile minds to inspire and equip themselves for rewarding career in the field of Science and Industry and Information Technology.
We have an efficient and enthusiastic band of teaching staff, with all devotion and dedication, to look after the student welfare and their progress. Blissful atmosphere and benediction pervade everywhere in the campus.
The college has many a resource meant for providing the staff and students with amenities in the campus. The management aims to offer excellent infrastructure and facilities to fulfill the aspirations of the students in order to stand, with fortitude, in the complexities of the challenging future.
Sathyanarayan Rao. M.V.V President&Correspondent, V.S.M.College,
Ramachandrapuram
********************************************************
కళాశాలను అన్నివిధాలా తీర్చిదిద్ది, ప్రత్యేకతను సంతరింపచేసిన
ప్రముఖ విద్యావేత్త డా. జి. రుద్రయ్య చౌదరి
కళాశాల అభివృద్ధిలో పాలు పంచుకున్న
శ్రీ గారపాటి సత్తిరాజు,(హిస్టరీ-పి.జి ఉపన్యాసకులు)
ప్రిన్సిపల్ గా సుదీర్ఘకాలం సమర్ధవంతంగా బాధ్యతలు
నిర్వహించిన శ్రీ కోడూరి రామకృష్ణ ప్రసాద్ (01-08-1978to30-11-1997)
కళాశాల పూర్వ పాలక వర్గ అద్యక్షులు,కరస్పాండెంట్ శ్రీ మూర్తినీడి రాము;
ప్రస్తుత అద్యక్షులు, కరస్పాండెంట్ శ్రీ ఎం.వి.వి. సత్యనారాయణ్ రావు
గారలతో శ్రీ కె.ఆర్.కె. ప్రసాద్
-
V.S.M College, Ramachandrapuram established in the year
affluent political cultural and agricultural elite but still it was
lacking an ordinary eminity like a college till the year 1966.
It is an irony that a man who had not the benefit of even
high school education should come forward with the noble
idea of starting an institution for higher education and
organise the educational society in 1965 and himself make
a mighty contribution and collect funds night and day and
turn out the miracle of starting one of the finest colleges
in the district .It is probably the result of an insatiable
urge and a noble impulse to give and afford to others
what is denied to him .
What is done by him is not a mean contribution to the
welfare of the taluk and its thousands of youth most of
whom would have gone without the benefit of
college education .They will forever remember
him as a patron of higher education in this area.
The taluk is forever indebted to him for this noble act
if not for his other welfare activities which resulted
in the starting of a High School in his father's name
and a Veterinary Hospital in his mother's name
and a Lift irrigation scheme to facilitate perpetual
second crop irrigation in a vast area not to speak
of several other public welfare activities with which
he is associated in his public life in various branches of
activity;political and social.True to the letter he is a
PEOPLE'S REPRESENTATIVE.
He is always work minded and moves shant like
an ethereal spirit to attend to the various problems
of the people mostly the havenots of his region .
He is a dynamic personality always smart cheerful
and optimistic. In the fitness of things the college at
Ramachandrapuram which is his making is rightly
named after him and he will be ever remembered
in this taluk as the Founder and Builder of this
great institution which has recently risen to the
dimensions of a POST GRADUATE CENTRE.
- K.V. RAMANAYYA , Advocate
Ramachandrapuram
(source: vsm college magazine)
********************************************
శ్రీమతి ఇందిరాగాంధీ, కాసు బ్రహ్మానంద రెడ్డి గారలతో
రాయవరం మునసబు గారు
మునసబు గారి కన్న తల్లి దండ్రులు-
శ్రీమతి రిమ్మలపూడి సూరమ్మ,శ్రీ నారాయణ మూర్తి
మునసబు గారి దత్తత తల్లి దండ్రులు-
శ్రీమతి వుండవిల్లి చెల్లయ్యమ్మ, శ్రీ రామయ్య
ముత్యాల మంగమ్మగారు (మునసబు గారి అత్త గారు )
మునసబు గారి భార్య శ్రీమతి రామతులశమ్మ
**************************************************
మునసబుగారి షష్టిపూర్త్యుత్సవ ఆహ్వాన సంఘం
అద్యక్షుడుగా ఎస్.ఆర్.ఎమ్.టి చైర్మెన్ శ్రీ కె.వి.ఆర్. చౌదరి
ఎస్.ఆర్.ఎమ్.టి చైర్మెన్ శ్రీ కె.వి.ఆర్. చౌదరి కళాశాలకు
నూతన బస్సును బహూకరించిన సందర్భంగా..
****************************************************
Vundavilli Satyanarayana Murthy College:
We have an efficient and enthusiastic band of teaching staff, with all devotion and dedication, to look after the student welfare and their progress. Blissful atmosphere and benediction pervade everywhere in the campus.
The college has many a resource meant for providing the staff and students with amenities in the campus. The management aims to offer excellent infrastructure and facilities to fulfill the aspirations of the students in order to stand, with fortitude, in the complexities of the challenging future.
Sathyanarayan Rao. M.V.V President&Correspondent,
Ramachandrapuram
కళాశాలను అన్నివిధాలా తీర్చిదిద్ది, ప్రత్యేకతను సంతరింపచేసిన
ప్రముఖ విద్యావేత్త డా. జి. రుద్రయ్య చౌదరి
కళాశాల అభివృద్ధిలో పాలు పంచుకున్న
శ్రీ గారపాటి సత్తిరాజు,(హిస్టరీ-పి.జి ఉపన్యాసకులు)
ప్రిన్సిపల్ గా సుదీర్ఘకాలం సమర్ధవంతంగా బాధ్యతలు
నిర్వహించిన శ్రీ కోడూరి రామకృష్ణ ప్రసాద్ (01-08-1978to30-11-1997)
కళాశాల పూర్వ పాలక వర్గ అద్యక్షులు,కరస్పాండెంట్ శ్రీ మూర్తినీడి రాము;
ప్రస్తుత అద్యక్షులు, కరస్పాండెంట్ శ్రీ ఎం.వి.వి. సత్యనారాయణ్ రావు
గారలతో శ్రీ కె.ఆర్.కె. ప్రసాద్
Dr.G,Gopalakrishna, K.R.K. Prasad,Dr.G.Rudrayya Chowdary |
-
V.S.M College, Ramachandrapuram established in the year
1966 owes allegiance to the great founder
Late Sri Vundavilli Satyanarayana Murthy garu
popularly known as Rayavaram Munsiff whose noble soul always
inspires and guides .During the last four decades the College
has grown from strength to strength and now it bloomed in to
one of the biggest Educational Institutions in the state with a
number of courses at U.G. and P.G. levels attracting students
from various districts in AP. VSM college lures the visitors
with its palatial buildings, beautiful gardens, well furnished
class rooms, well equipped laboratories, a treasure island of books.
VSM college is a spark-house of knowledge and wisdom with
Computer Applications and a fountain of Information Systems.
The college offers a number of courses at U.G. & P.G. levels
attaining the status of a Mini-University. It welcomes the
zealous juvenile minds to inspire and equip themselves for
rewarding career in the field of Science and Industry and
Information Technology.
The College has an efficient and enthusiastic band of teaching staff, with all devotion and dedication, to look after the students welfare and their
progress.Blissful atmosphere and benediction pervade
everywhere in the campus. The college has many a
resource meant for providing the staff and students
with amenities in the campus. The management aims
to offer excellent infrastructure and facilities to fulfill the
aspirations of the students in order to stand,with
fortitude, in the complexities of the challenging future.
Succession List Of Principals
Sri K.Shaktiraja reddy(Principal01-08-2000To30-06-2000) |
Smt&Sri R.Ramakrishna rao(Principal01-06-2010To31`-05-2011) |
VSM College of Engineering:
Late Sri Vundavalli Satyanarayana Murthy, a great philanthropist and renowned personality founded VSM College in the year1966. It is one of the illustrious institutions in the state, with number of UG and PG Courses. To cherish his dreams and wishes of imparting technical education to the rural folk, the governing body of VSM College under the president ship of Sri Sathyanarayan Rao M.V.V. has established VSM College of Engineering in the year 2009.
VSM College of Engineering, a co-eductional, self financed, private Engineering college, affIliated to Andhra University, Visakhapatnam and approved by AICTE, New Delhi.
At present the college is offering four B.E./B.Tech courses at undergraduate level i.e Civil Engineering, Mechanical Engineering, Electronics & Communication Engineering each with an intake of 60. The college has well qualified, committed and dedicated faculty and is supported by hard working, devoted technical & non- technical staff. The college also has well equipped laboratories with sophisticated equipment.
V.S.M.COLLEGE- P.G.COURSES
కళాశాల రూపశిల్పి,ప్రముఖ విద్యావేత్త
డాక్టర్ గరిగిపాటి రుద్రయ్య చౌదరి
An Epitome Excellence
Fair pledges of a fruitful tree
Why do ye fall so fast
Your date is not so past
But you may stay yet here a while
To blush and gently smile
And go at last
An epoch has come to an end. The mentor of many a scholar has left this earthly abode to be the guiding star of all from above.
Beacons from the abode where the eternal are.......(Shelley)
The soul of Adonis, like a star;
Dr. Garigipati Rudrayya Choudary, fondly remembered as GRC is no more. But, i feel his spirit pervades every nook and corner of this institution manifest through the magnificent precinct which was his `Dream-Child'. Let us hope his spirit will protect,hence-forth, this `Temple of Learning' as a guardian Angel. We mourn his untimely demise and our grief will make sense only if we recall and place on record the services of Dr. GRC to the cause of education in general and his inestimable contribution to our college in particular.
He was an ardent admirer and fervent follower of our Founder President, late Sri Vundavilli Satyanarayana Murty garu. By virtue of his diligence and dedication Dr. GRC proved his craedentiales worthy to be nominated by his mentor as the Regent -Par-Excellence,and in no time he accomplished the task assigned to him in flying colours. It is undeniable that he exercised absolute power in the administration, orgianisation and governance of this splendid institution though officially designated as Vice Principal. But he crowned our college with laurels from all over the State. He was profoundly serious in the discharge of his duties and was inspired by the noblest ideals of education.
Dr. Rudrayya Choudary was an enlightened academician who conceived several innovative schemes for the benefit of the students. Thousands of well-placed officers,doctors and engineers who were once the alumni of this institution still cherish their gratitude for him. A benefactor supreme by generosity, he shaped the destinies of many of us. He instilled descipline in the students, infused a sense of dedication in us, and cultivated the noblest traditions of this institution. Despite his indifferent health he strived tirelessly for excellence in acade-mics, Like the preacher in "The Deserted Village"of Goldsmith:
Though round its (his) breast the rolling clouds bare spread Eternal Sun-shine setts on its (his) head.
Though hunted by the lurking death for over a decade Dr. GRC cheerfully endeavoured to nurse this `off-spring' of Sri Munsiff garu fondly, and dreampt profusely of its future glory.
Dr. GRC was an able administrator and efficient organiser. Like a bee that draws honey from the flowers without hurting them, Dr.Choudary spotted and tapped the talent of the students and staff for the grandeur and glory of our college. During his regency, this college bloomed in full splendour discipline reigned, dedication fructified, academic results boomed, the campus reverberated with music-song-drama, and the mood of the public was full of praise for the architect of this Marvel.
"Reading make a full man, conference a ready man, and writing an exact man" , Dr. GRC read deeply, conferred much and wrote in varied degrees of industry. His personal library testifies to his extensive erudition. His visit to the USSR and his stay in the USA broadened his vision of the world, and the publication of his Doctoral thesis on Prakasam stood him as a scholar of rare insight. Alexander pooe paid a rich tribute to John Gay; of manners gentle, of affection mild
in art a man, simplicity - a child.
Dr.Choudary richly deserves the same compliment.
As a teacher of exceptional virtue he used to resurrect dead History by his unique method of telescoping the past into the present for the purpose of comparative study and analysis. For him, the study of History was not a stale exercise in academics but a lesson of human triumph and tragedy with all the follies and foibles. He was a visionary and a dreamer. The master-pieces of master-spirits were his darlings. A glance at the verdant gardens, adorning statues, inspiring inscriptions, imposing masionary and the spectacular open-air-theatre compel us to salute this man of many parts for his wonderful vision and fine taste.
Dr. Rudrayya Choudary was instrumental in the establishment of several educational institutions like : GV&KBM School, Ramachandrapuram Mahila Kalasala, Dr. Garigipati Rudrayya Choudary Junior college for Women and was a source behind a host of other educational institutions run by his votaries. No wonder, he was aptly chosen by the Government of Andhra Pradesh for the Best Teacher Award.
He adored several prestigious positions; he was the General Secretary of the A.P.History Congress, Secretary of A.P.Peace Council, Zonal Chairman of Lions Club, President of the East Godavari District Progressive Writers Association, District President of ISCUS, President of the District Basket Ball Association, and a member of the Districr Sports Council. H e was the promoter of Ramachandrapuram Film Society, Lions Kalyana Mandapam,Dr.Chelikani Ramarao Memorial Hall and many more. What better homage can suffice to honour the memory of Dr. Rudrayya Choudary than to recall in Shakespeare's words;
His life was gentle; and the elements
so mixed in him that Nature might stand up
And say to all the world
`This was a Man'
- M.V. KRISHNAIAH
Lecturer in English
Source : VSM College Magazine, 1994-95
మునసబు గారి కాంశ్య విగ్రహం:
BotanyDept. Staff :
Smt.K.NagarajaKumari,Smt.S.SwarajyaLakshmi,
Dr.G. Gopalakrishna, Marni Subbarao , Kotha Kamalakaram
Standing:Suryanarayana,ChandraRao,Krishna Murthy
Sarva Sri - Kotha Kamalakaram Bikkina V Rama Rao,
G Koteswara Rao, B B Sarma, M V Krishnayya, K Venkateswara Rao,
Jasti Durga Prasad (Rtd. Lecturers &Principals)
Sri K S Chowdary,Sri B B Sarma, Sri G Koteswara Rao(Rtd. Lecturers)
లెక్చరర్స్ శ్రీమతి కొడాలి నగరాజకుమారి, శ్రీమతి సూరపనేని స్వరాజ్య లక్ష్మి,
శ్రీమతి (స్వర్గీయ)శేషమాంబ, శ్రీమతి సుబ్రమణ్యేశ్వరి
స్వర్గీయ సూరపనేని పద్మనాభ రావు(ఫిజిక్స్), స్వర్గీయ డా. నేమాని నాగేంద్రరావు(ఎకనమిక్స్)
(Late) sri koripalle Subbarao, Rtd.Lecturer
స్వర్గీయ ఎస్. ఉమామహేశ్వర రావు(కెమిస్ట్రీ)
---------------------------
మునసబు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ..
VSM College President&Correspondent
Sri Sathyanarayan Rao. M.V.V
******************************************************
శ్రీవుండవిల్లి సత్యనారాయణ మూర్తి షష్టిపూర్తి సన్మాన సంచిక-1976
*************************************************
షష్ట్యబ్ద్యుత్సవ సభా విశేషాలు -
ప్రముఖుల సందేశాలు....క్లుప్తంగా.....కొన్ని:
మా మునసబుగారు..
అనపర్తి గణేశ్వరరావు,ఎం.ఎస్సి;
ప్రిన్సిపల్(పూర్వ),వి.ఎస్.ఎం.కాలేజి, రామచంద్రపురం.
మా మునసబుగారు ప్రజల మనిషి. ప్రజల కష్టసుఖాలు ఆయనకనుభవైకవేద్యాలు. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం, వాళ్ళకు సాయపడటం ఆయనకి వెన్నతోపెట్టిన విద్య. ఆయన నాయకత్వం బలమైన పునాదులతో ప్రజల హృదయసీమల్లో సుప్రతిషితమైంది. ప్రజలు ఆయన్ని తమ వాడుగా భావించుకొంటారు.
మా మునసబుగారిది కార్యాచరణ మార్గం. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టే స్వభావం. కార్యాచరణంలో పట్టుదల, తీవ్రత, ఆయన విలక్షణ లక్షణాలు. తలపెట్టింది పట్టుదలతో సాధించడం, ఆ సాధించడంలో తీవ్ర గమనం ఆయన పద్దతులు. ఆయన నడకలాగే, కార్యసాధనలో ఆయన తీవ్ర గమనాన్ని ప్రక్కవాళ్ళు అందుకోగలగడం కష్టం. ఆయనలో వున్న ఆ ‘డైనమిజమ్’ ఆయన మహానాయకత్వ లక్షణంగా నేను భావిస్తాను.
మా మునసబుగారి మహోన్నత వ్యక్తిత్వానికి కార్యదక్షతకి మా కళాశాల మహోన్నత భవనాలు ప్రతీకలుగా నిలుస్తాయి. అతి స్వల్ప కాలంలో యింత మహోన్నత నిర్మాణం వారి తీవ్ర కార్యాచరణకి సూచికగా మనసులకెక్కుతుంది.
మా మునసబుగారికి జరిగే షష్టిపూర్తి ఉత్సవాన్ని యీప్రాంత ప్రజలు తమ పండుగగా జరుపుకుంటారు. ఆయన కీర్తి కిరీటాలయిన తుల్యభాగా లిఫ్ట్ యిరిగేషన్, హరిజన గృహకల్పనం, సహకార సంఘాలు, ఉన్నత పాఠశాలలనుండి మహోన్నత కళాశాలా నిర్మాణం - వీటన్నిటివల్లగాని, వీటిలో యే ఒక్క దానివల్లగాని లాభం పొందని వాళ్ళు, వీటి ప్రభావ ప్రభావితులు కానివాళ్ళు యీ ప్రాంతాల ఒక్కరుకూడ ఉండరు అనడం సహజోక్తేకాని అత్యుక్తి కాబోదు. తన మహోన్నత వ్యక్తిత్వంవల్ల యీ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం, ప్రకాశితం చేసిన మా మునసబు గారికి జరుగుతున్న షష్టిపూర్తి సన్మానోత్సవం శుభప్రదం, విజయవంతం కావాలని, వారి ప్రజాసేవా జీవితం నిరాటంకమై, అమేయమై, అసమానమై ప్రకాశించాలనీ, వారికి దైవం దీర్ఘాయురారోగ్య సంపదైశ్వర్యాల్ని, ఉన్నతిన ప్రసాదించాలని పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
*****************************************************
L. Bullayya
(Ex) Vice - Chancellor, Andhra University
............He is known to all of us as " Rayavaram Munsiff " and i wonder how many people know his real name! He has been in the field of politics for a long time and was also a Legislator for some time.
Though a rich by birth, for some reason he did not have an opportunity to go to college or university, but he is endowed a rare gift known as commonsense which many and educated men lack. This of men and matters enabled him to carry on his responsibilities as district leader.
What strikes one most is his keen interest he evinced in higher education not for himself, not for his children but for all boys and girls in and around Ramachandrapuram.He felt the need for a college in that thickly populated area. Unlike the management of colleges elsewhere who could not provide minimum physical requirement to colleges started by them , Sri Munsiff garu rose up to the occasion and showed a tremendous will in organising the V.S.M. College almost single handed with the help of the local people large amounts of donation were collected for the noble cause and within a short span of time a huge building programme was taken up and completed. This is not a small achievement. Sri Munsiff was able to provide one of the finest educational institutions in the state. All those interested in higher education should be grateful to Sri Munsiff for his foresight in creating this magnificent institution........
-L. Bullayya
*******************************************************
P.Sriramam, M.A,B.Ed;(APES)
First Prinncipal of V.S.M. College
As one coming from an agricultural family in the rural areas of Ramachandrapuram taluk of East Godavari District, Sri Vundavilli Satyanarayanamurty garu is a typical representative of rural folk whose actual needs and problems he had understood thoroughly and whose cause he had taken up even from the beginingof his public career. Though Sri Satyanarayanamurty garu is devoid of the advantages of a formal training and education, he possesses a sound and shrewed commensense with a knack of understanding men and this easily. He is neither a dreamer nor a sentimentalist, but is essentially a man of action and ahard realiest. His indefatigable energy, unbounded self confidence and tenacity of purpose enabled him to hold several responsible positions in public life including the membreship of the Legislative council in the state of Andhra Predesh. He is an incorrigiable optimist and stands like a rock against all currents and cross currents of public life. He is easily accessible to one and all and extends a patient and sympathetic hearing to their representations exploring the possibilities for such help and assistance as he could promptly render. Inspite of his seemingly stern exterior, he is full of the milk of human kindness.
The establishment of a first grade Science and Arts College in Ramachandrapuram in June 1966 which had been a long-felt need of the people of that area is his crowning achievement. He was good enough to invite me to take over the Principalship of the new college in which capacity i had the opportunity of working with him for two years fro June 1966 to Jjuly 1968 during which period i humbly endeavoured to serve the infant institution to the best of my ability by laying sound traditions in respect of academic standards and general discipline. Sri Vundavilli Satyanarayanamurty garu in his capacity as the President of the college Managing committee treated me with utmost respect, giving due weight to all proposals and suggestions made by me for the successful and efficient running of the institution.
His ambition has always been to make his college as one of the biggest and the best in Andhra. With all his drive and dynamism, he set out initiating appropriate steps for the construction of spacious and imposing buildings for the college, and completed the project in a record time. I have always felt that strong will to achieve something landable will of its own accord find appropriate ways and means of attaing the objective; Hence it is hoped that the college founded by Sri Vundavilli Satyanarayanamurty garu will add dimension upon and continue to serve the cause of higher education in accordance with the highest ideals of discipline, enlightenment and learning.
- P. Sriramam
*************************************************************************************
రాయవరం మునసబుగారు
రావు గోపాలరావు
రాజ్యసభ మాజి సభ్యుడు, ప్రముఖ సినీ నటుడు.
కొందరికి క్రికెట్ ఆట అంటే సరదా.. మరికొందరికి పేకాటన్నా, కోడిపందాలన్నా-గుర్రప్పందేలన్నా- సరదా.. రాయవరం మునసబుగార్కి యీ సరదాలేమీ లేవు..ఆయనకున్న ఒకే ఒకసరదా .. ఎలక్షన్లు. చాలామంది రాజకీయ నాయకులు ఎలక్షన్లంటే భయపడతారు. కాని మునసబుగారంటే ఎలక్షన్సే భయపడతాయనివిన్నాం.. ఎందుకంటే ఎలక్షన్సులో ఆయన స్పీడు-ప్రత్యర్ధులులేకాదు, స్వజనంకూడా తట్టుకోవడం కష్టం.
ఆయనకు రాజకీయమంటే ఒక చదరంగం.. ఆయన వేసే ఎత్తులు, ప్రత్యర్ధుల్ని చేసే చిత్తులు, భలే గమ్మత్తుగా వుంటాయి- ఆయన మంత్రిచేత రాజును బంధించడం ప్రజ్ఞగా భావించరు. బంటు చేతిలో మంత్రి దెబ్బతినడం- శకటు సాయంతో రాజు ఆట కట్టించడం - ఆయన ప్రజ్ఞగా భావిస్తారు.
తూర్పు గోదావరిజిల్లా రాజకీయ చదరంగంలో- ముప్ఫై సంవత్సరాలుగా ఆయనదే పైచేయి.. అప్పుడప్పుడూ, ఆట తప్పటడుగుపడ్డా ఆయన బాధ పడరు...గెలుపు- ఓటమి,రెంటినీ చిరునవ్వుతో స్వీకరించే స్వభావ మాయనది.. యుద్ధంలో వెన్ను చూపడంకంటె-రాజకీయాల్లో వెన్ను చూపించడం హీనాతిహీనమని ఆయన నమ్మకం. రాజకీయనాయకుని జీవితం- నేలమీదపడ్డ మట్టిపాత్ర కాకూడదు- రబ్బరుబంతి కావాలని ఒక మహా నాయకుని ఉవాచ. అదే మునసబుగారి విశ్వాసం.. ఆయన రాజకీయ జీవితం..అందుకే ఆయన్ను పవర్ పొలిటీషియన్ గా ఎవరూ భావింపరు..పవర్ఫుల్ పొలిటీషియన్ గానే ప్రజలు, రాష్ట్ర నాయకులు గౌరవిస్తారు.
ఆయన ఏ కాలేజీలోనూ చదవక పోయినా, ఎందరో మనుషుల జీవితాలను కూలంకషంగా చదివినవారు.. కాలేజి విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించినవారు...ఎన్నో బృహత్తర. ప్రజాహిత కార్యక్రమాలను- ఏకవ్యక్తిగా, స్వశక్తితో సాధించినవారు..
రాజకీయ నాయకుల్లో అరుదుగా కనిపించే ఒక ప్రత్యేకత మునసబుగారిలో చూస్తాం..అదేమిటంటే ఆయనకు జాతి, కుల, మత విభేదాలు లేకపోవడం..అన్ని ‘ఇజాల’లోకి ‘కమ్యూనలిజం’ భయంకర శత్రువని ఆయన అభిప్రాయం..ఆయన్ను అభిమానించే వారు స్వకులంలో కంటే- యితర కులాల్లోనే ఎక్కువగా వుండటం, ఆయనలోని ఆదర్శనీయమైన ప్రత్యేకత...మునసబుగారికి ఎన్నో పదవులు రావచ్చు..పోవచ్చు..కాని, ఆయనకు తిరుగులేని శాశ్వతమైన పదవి ఒక్కటే..అదే "రాయవరం మునసబు"- అది ఆయనకు దేవుడిచ్చిన వరం.. లక్షలాది ప్రజలు ప్రేమానురాగాలతో-గౌరవించే పెద్ద బిరుదు..
అరవై సంవత్సరాలు జీవించినందుకు షష్టిపూర్తి జరుపుకోవడం పరిపాటి... కాని, కాలాన్ని విలువైనదిగా భావించి, అర్ధవంతంగా ఆదర్శవంతంగా జీవించి, సమర్ధవంతునిగా రాణించి, అనేకానేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించి, షష్టిపూర్తి ఉత్సవం- గర్వంగా, నేత్రపర్వంగాజరుపుకుంటున్న శుభసందర్భంలో- ఆ మనీషిని ప్రజలందరితోబాటు "శతమానం భవతి" అని ఆ జిల్లా వాసిగా, నేనూ కోరుకుంటున్నాను.
శలవు,
రావు గోపాలరావు
************************************************************
పి. గోపి
సినీ రచయిత
మంచివాళ్ళమనుకునే వాళ్ళకి ఈయన చాలామందికి చెడ్డవాడు కావచ్చు. ఎందరో చెడిపోయిన వాళ్ళకి మాత్రం మంచివాడని నాకర్ధమైంది. వ్యంగ్యం కాదు..ఆయన కట్టిన కాలేజి యిలా వ్రాయిస్తోంది. ఆయన చదువుని ప్రేమించగలడో లేదో తెలియదు..కాని చదువుకుని పైకి రావలసిన పిల్లల్ని ప్రేమిస్తారన్నది నిజం!
ఒకో మనిషి వుంటాడు. అతణ్ణి ప్రపంచం అంతా గొప్పవాడంటుంది..అందులో కొందరు తమకు లాభించటంకోసం అంటారు. మరి కొందరు అతణ్ణి గొప్పవాడనటంలో తమకి నష్టంలేదు కాబట్టి అంటారు.
సృష్టిలో ఒకే ఒక్క పదార్ధం వుంది..అది దర్పణం లాంటిది.. ఏమనిషి మంచిచెడుల్నైనా వున్నది వున్నట్లు నిర్భయంగా, నిర్మొహమాటంగా చూపిస్తుంది. దాని పేరు అంతరాత్మ. ఆ అద్దం ముందు నిలబడినప్పుడు భయపడకుండా, పశ్చాత్తాపపడే అవసరం రాకుండా ఎవరు బ్రతగ్గలరో వాళ్ళే నిజమైన గొప్పవాళ్ళు. ఈ మనిషికి ఆ సాహసం, నైర్మల్యం ఉన్నాయని నా విశ్వా సం. ఎప్పటికీ ఉండాలని ఆకాంక్ష.
వారెవరో తెలీయకుండా వార్ని గురించి అతి కొంచెం తెలుసుకున్న..
పి. గోపి
*************************************
శుభాకాంక్షలు....
అల్లు రామలింగయ్య
సినీ ఆర్టిస్ట్
మునసబుగారితో నా పరిచయం కొద్దిపాటిదే అయినా ఆయనపట్ల నా అవగాహన పెద్దపాటిదయిందనే చెప్పవచ్చు.
మనసులో ఒకమాట పైకొకమాట అనే బాపతు వ్యక్తిత్వం కాదాయనది. ఆ అనేమాట ఏదో ముక్కుసూటిగా గట్టిగా అంటేగానీ ఆ రాత్రికి ఆయనకు నిద్రపట్టదు. పైగా ఆయనది గంభీర కంఠస్వరం. రూపంలో మాటలో చేతలో మునసబుగిరీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
సుసంపన్నమైన కుటుంబంలో జన్మించిన ఆయన సామాన్యకార్యకర్తగా కాంగ్రెస్ సంస్థకు చేసిన సేవలు; పిత్రుతుల్యు డైన నాయకుడుగా తాలూకానూ, జిల్లానూ నడిపినతీరు, సుదీర్ఘకాలం శాసనమండలి సభ్యునిగానే గాక వివిధ పదవుల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. సాంఘికాభ్యుదయ సాధనలో ఆయన సలిపిన కృషి గణనీయమైనది. ముఖ్యంగా విద్యాభివృద్ధికి ఆసక్తితో అభిరుచితితో ఆయన సాధించిన విజయాలు ప్రతివ్యక్తీ మరీ మరీ గుర్తుంచుకోతగినివి.
ఆంధ్రమాతకు అల్లారు ముద్దుబిడ్డడైన మునసబుగారి షష్టిపూర్తి వుత్సవాలసందర్భంగా ఆయన అతులిత సౌభాగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. సమర్ధవంతమైన ఆయన సారధ్యం నేడు ఎంతేని అవుసరంగనుక ఆయన సేవలు సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.
శ్రి మునసబుగారికి నా గౌరవ పురస్సర శుభాకాంక్షలు..
భవదీయుడు
అల్లు రామలింగయ్య
* * * * *
అంతులేని మనిషి
-జి.వి.వి.సత్యనారాయణ మూర్తి, ఎమ్.కాం; ఎమ్.ఎ(సైకాలజి)
రిటైర్డ్ లెక్చరర్,పత్రికాసంపాదకుడు
మీరెంతో చదువుకోలేదు
కాని ఎంతమంది మీ దగ్గర చదువుకుంటున్నారు!
మీ చదువెంత చిన్నది
అయినా ఎంత పెద్ద చదువులు చెబుతున్నారు!
మీరొక్కరే!
అయినా ఒక్కసారి వెయ్యిమందికి పైగా మీ పాఠాలు వింటున్నారు!
అప్పుడయినా కంటికి కనిపించరు
దేవుడిలా
ఇదెంత విడ్డూరం! అయినా ఎంత నిజం!
ఇది మీరు కట్టించిన దేవాలయం
దేవుడే దేవాలయాన్ని కట్టించడం
మీరు చేసిన ఓ చిత్రం! విచిత్రం!
అధ్యాపకుల్లాంటి పూజారులు,
విద్యార్ధుల్లాంటి భక్తులు
తరం తరం, నిరంతరం.
మీకీ రోజు అరవయ్యేళ్ళు
అయినా కాలంతో మీకు నిమిత్తంలేదు
గాలి, నీరు ఉన్నంతకాలం,
మీరుంటారు,
మీరు చేసిన ‘మనుషు’లుంటారు
* * *
******************************************************************************
.............. కాంగ్రెస్ లో చిన్ననాటనే చేరి ఆ సంస్థకు యితోధికముగా సేవచేసినారు. ఆయన మంచి స్నేహపాత్రుడు. ఎన్నో పర్యాయములు, ఎన్నో పదవులును జిల్లా స్థాయిలోను, రాష్ట్రస్థాయిలోను, చేపట్టి ఏపదవిలో ఉన్నా ఆ పదవిని తీర్చిదిద్దినారు. దానికి కారణం ఆయనకు వున్న కార్యదీక్ష, పట్టుదల, ప్రజలలో ఆయనకు వున్న పలుకుబడి.............
-తోట రామస్వామి
(మాజీ మంత్రి)
*****************************
శ్రీ వుండవిల్లి సత్యనారాయణ మూర్తి ప్రజాహిత కార్యక్రమాలలో ముఖ్యముగ రామచంద్రపురం కళాశాల నిర్మాణము, భవన నిర్మాణము అన్నవి ఆదర్శప్రాయము. శాసనపరిషత్తు సభ్యులుగా, రాయవరము పంచాయితి సమితి అద్యక్షులుగా, రామచంద్రపురం కేంద్ర సహకార బ్యాంకు అద్యక్షులుగా ప్రజలకు సేవచేసి యున్నారు....
-వావిలాల గోపాలకృష్ణయ్య
**********************************
.......విద్యావంతులైన యువకులు రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయాలస్థాయి పెంచాలని మనసారా నమ్మి ఆచరించిన మహావ్యక్తి.
మా గురువుగారు నూరేళ్ళు వర్ధిల్లి వందల వేల శిష్యుల్ని తయారుచేసి పైకి తీసుకురావాలని భగవంతుని ప్రార్ధిస్తూ...
వల్లూరి రామకృష్ణచౌదరి, శాసనసభ మాజీ సభ్యులు.
**********************************
శ్రీ మూర్తి గారిని ఆంధ్రదేశంలో ఎరుగని వారు లేరు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు వారు చేసిన సేవ ప్రాతఃస్మరణీయం. లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోశాధికారిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా వారు చేసిన ఆంధ్రదేశానికంతకూ విదితము. ఆయా సందర్భాలలో వీరితో కలిసి పనిచేసిన రోజులను నేనెన్నిడూ మర్చిపోలేను. కాగా తూర్పు గోదావరి జిల్లా పరిషత్తు ఉపాద్యక్షులుగా, రామచంద్రపురం సెంట్రల్ బ్యాంకు అద్యక్షులుగా, వి.ఎస్.ఎం .కాలేజి నిర్వాహకులుగా వారు చేసిన, చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయం.,అభినందనీయం...
-ఎం.ఆర్. అప్పారావు, ఎం.ఏ
మాజీ ఉప కులపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం.
**************************
......తన సేవలను ప్రజలకు ఉత్సాహముతో నందించుచు, తన జిల్లాలో సహకార సంఘము మున్నగు సంస్థలను జయప్రదముగ నిర్వహించిన నాయకుడు. ముఖ్యముగ రామచంద్రపురమున, తన ప్రత్యేక కృషితో, పట్టుదలతో నొక కళాశాలను నెలకొల్పి, చక్కగ దానిని నిర్వహించుచున్న దిట్ట. తాను పూనిన కార్యమును - ఎట్టికష్టనష్టముల నైనను గుఱియైసఫలవంతమొనర్చుకొనుచున్న నేర్పరి. ......
-కల్లూరి చంద్రమౌళి, బి.ఎస్సీ;(ఎబర్డీన్)
మాజీ మంత్రి
************************************
Koppaka Ramakrishna,B.Com:
Convenor- Citizens council,
Director:VBC Industries
Hon. Presitdent `VEDIKA'-kAKINADA
మరువలేని మహావ్యక్తి శ్రీ రాయవరం మునసబు గారు.
మన జీవనయానంలో ఎందరినో కలుస్తూ ఉంటాం. వారితో అనుబంధాలు పెంచుకొనేతీరులో వివిధరకాలుంటాయి. కాని నాజీవితరంగంలో ఎందరో రాజకీయ, సినిమా, సామాజిక రంగ ప్రముఖులతో పరిచయాలు అనుబంధాలు ఉన్నాయి. కానీ శ్రీ మునసబు గారితో ఉన్న అనుబంధం మరువలేనిది, విడదీయరానిది. ఆయన వ్యక్తిత్వం, ఆలోచనా, బయటతీరు మరోలా అనిపించినా, ఆయన భావాలు, ఏదో చేయాలనే తపన నాతో పంచుకొన్నారు. మాట ఎంత కఠినమో మనస్సు అంత మంచిది. ఎప్పుడు కాకినాడ వచ్చినా నన్ను కలువకుండా వెళ్ళేవారుకాదు.
ఎస్.బి.పి.బి.కె సత్యనారాయణరావు గారు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎం.ఎల్.సి గా పోటీచేయాలని ముహూర్తం పెట్టుకొని నాదగ్గరకు వచ్చారు. ఇంతలోనే శ్రీమునసబుగారూ నాదగ్గరకు వచ్చారు. సత్యనారాయణగార్ని చూపించి ఎం.ఎల్.సి గా పోటీచేస్తున్నారనీ, మీగురించే మాట్లాడుకుంటున్నాం అనీ, మీ సహకారం అర్ధిస్తున్నారని చెప్పాను. శ్రీ ఎస్.బి.పి.బి.కె, నేనూ ఎన్నో విషయాలు చెప్పాం. దేనికీ మాట్లాడకుండా మౌనం వహించారు. తిరిగివెళ్ళిపోతూ "మీరిద్దరూ రేపు రాయవరం భోజనానికి రండి" అనిచెప్పి వెళ్ళిపోయారు. తనను ప్రత్యర్ధివ్యక్తిగా భావించి మాట్లాడలేదని భావించిన శ్రీ ఎస్.బి.పి.బి.కె, ఆయన ఆహ్వానం తో పులకరించి ఎంతో ప్రశంశించారు. మర్నాడు రాయవరం వెళ్ళాక,భోజనాలయ్యాక, శ్రీ ఎస్.బి.పి.బి.కె,ను కారులో ఎక్కించుకొని రామచంద్రపురం, జి.మామడాడ, యింకా అనేక ప్రాంతాలు త్రిప్పి తనమాటగా శ్రీ ఎస్.బి.పి.బి.కె,ను గెలిపించాలని మరీ,మరీ చెప్పారు.
ఎన్.టి.రామారావుగారితో నాకుండే అనుబంధం మునసబుగారికి తెలుసు. ౧౯౮౨లో ఎన్నికలరంగంలో జిల్లా అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం బాధ్యత
ఎన్.టి.ఆర్ నాకు అప్పగించారు. జిల్లా మొత్తంలో 19 టి.డి.పి. ఎం.ఎల్.ఏలు నెగ్గారు. తరువాత జడ్.పి అద్యక్షునిపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు టి.డి.పి.కి మూడు సీట్లు తక్కువ అనిపించింది. నేను మునసబు గారి సహాయం కోరాను. ముందు మౌనం వహించి, తీర్మానంరోజు నలుగురిని తీసుకొనివచ్చి మాకు సహకరించారు. ఎన్.టి.ఆర్ మునసబుగారికి నమస్కరించాలని, ఒకసారి హైదరాబాదు తీసుకురమ్మని కోరారు. మునసబుగారు ముందు కాదన్నా, తరువాత నావెంట హైదరాబాదు వచ్చి, ఎన్.టి.ఆర్ ని కలిస్తే, ఎన్.టి.ఆర్ శ్రీ మునసబుగారిని ఎంతో కీర్తిస్తూ , ఆలింగనం చేసుకొని మాట్లాడిన విషయాలు ఎప్పటికీ మరువలేను.
అలాగే ఆయన మరణానంతరం మాస్వగ్రామం సోమేశ్వరం పంచాయతీ ఆఫీసులో ఆయన ఫొటో ఆవిష్కరణ సమావేశానికి ఎందరో ప్రముఖులు వచ్చారు. అందరికీ ఆయన ఫొటోతో ఉన్న మెమెంటోలు యిచ్చాను. యింకా మరెన్నో అనుభూతులు వ్రాయలేకపోతున్నాను..
-కొప్పాక రామకృష్ణ, కాకినాడ
1 నవంబరు 2008
(మునసబుగారిని ఎల్లవేళలా స్మరించి, అభిమానించే వారిలో ముఖ్యులైన శ్రీ రామకృష్ణ గారిని.. నాలుగు మాటలు వ్రాయమని ఫోనులో కోరినవెంటనే ...ఆరోగ్యం బాగులేకపోయినా...జ్ఞాపకాలు పంపించారు..ఎన్నో ఉన్నా.."చేయి" వ్రాయడానికి సహకరించక వ్రాయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు..ఆ మహానుభావునితో తన అనుబంధం విడదీయలేనిదని...ఆయన్ని గుర్తుచేసుకున్నారు..మునసబుగారు లేని లోటు ఎప్పటికీ, ఎవరూ తీర్చలేరంటూ..కన్నీళ్ళతో అంజలి ఘటించారు శ్రీ రామకృష్ణ గారు..ఈనాప్రయత్నాన్ని అభినందించారు.- కమలాకరం కొత్త )
**********************************************
శ్రీ వుండవిల్లి సత్యనారాయణమూర్తి గారి
పందొమ్మిదవ వర్ధంతి (19)
వి.ఎస్.ఎం. కళాశాలలో..
6-11-2008
శ్రద్ధాంజలి ఘటిస్తున్న రాష్ట్రమంత్రివర్యులు శ్రీ పిల్లి సుభాస్ చంద్రబోస్
శ్రద్ధాంజలి ఘటిస్తున్న మునసబు గారి భార్య శ్రీమతి రామతులశమ్మ
వివిధ కార్యక్రమాలలో మునసబుగారు..
Sri Sathyanarayan Rao M.V.V |
VSM College of Engineering |

M.V.Krishnaiah |
- M.V. KRISHNAIAH
Lecturer in English
Source : VSM College Magazine, 1994-95
మునసబు గారి కాంశ్య విగ్రహం:
కళాశాల భవన సముదాయం:
మధుర స్మృతులు :
BotanyDept. Staff :
Smt.K.NagarajaKumari,Smt.S.SwarajyaLakshmi,
Dr.G. Gopalakrishna, Marni Subbarao , Kotha Kamalakaram
Standing:Suryanarayana,ChandraRao,Krishna Murthy
Sarva Sri - Kotha Kamalakaram Bikkina V Rama Rao,
G Koteswara Rao, B B Sarma, M V Krishnayya, K Venkateswara Rao,
Jasti Durga Prasad (Rtd. Lecturers &Principals)
Sarvasri U.Baburao, K.Shaktiraja reddy, J.Durga prasad,K.S.N.Murty M.Subbarao, K.Ramasubbarao, V.Srinivasarao, |
Sri K S Chowdary,Sri B B Sarma, Sri G Koteswara Rao(Rtd. Lecturers)
Sri S Koteswara Rao ( Director, VIKAS,HYD.)
Smt. S Swarajya Lakshmi (Retd. Lecturers)....
Sri "ADITYA " Seshareddi MLA;
Sri J Drga Prasad( principal, 01-07-2003to30-06-2004)
Sri "ADITYA" Sesha Redd, MLA (Old Student,VSM College )
Sri Kanuri Mastan ,Sri PVN Raju ( Retd. Lecturers )
Dr.G.Radhakrishna
(Principal, 01-12-1997 to 31-01-2000)
Sri SPMN Naidu (History Lect. Rtd.)
Sri KSN Murty (Rtd. Lecturer)
Sri K. Ramasubbarao(Commerce)

Sri M.V.Krishnayya |
Sri B V Ramarao, ( Principal,01-07-2001to30-09-2002) |
Sri K.ACHAYYA CHOWDARY |
Sri U.Baburao |
Sri R.Chitti babu |
Sri SPMN Naidu (History Lect. Rtd.)
Sri KSN Murty (Rtd. Lecturer)
Sri K. Ramasubbarao(Commerce)
Sri M.seetaram |
Sri G.Narayana Reddy |
Sri B.V.Ramarao |
Sri V.Srinivasarao |
Sri B.Veerayya Chowdary |
Sri C.T.Venkateswara rao |
Sri P.V.N.Raju&Sri B.V.Chowdary |
Dr. Mallina Venkatarao (Hindi) |
Sri M.Subbarao |
Sri M.Lakshmana murty |
Sri K.Shaktiraja reddy |
Sri R.Ramakrishna rao |
Smt.K.Nagaraja kumari |
Dr.T.Haranadha babu |
R. Gangaram, ( Principal,01-07-2004to30-06-2008) G.Venkateswararao, (Rtd. PhysicalDirector) |
Sri G.Krishna Mohan(Principal 1-10-2002To 30-6-2003) |
Smt.&Sri V.Srinivasarao |
Smt.&Sri V.Bapiraju |
Smt&Sri V. Satyanarayana |
లెక్చరర్స్ శ్రీమతి కొడాలి నగరాజకుమారి, శ్రీమతి సూరపనేని స్వరాజ్య లక్ష్మి,
శ్రీమతి (స్వర్గీయ)శేషమాంబ, శ్రీమతి సుబ్రమణ్యేశ్వరి
స్వర్గీయ సూరపనేని పద్మనాభ రావు(ఫిజిక్స్), స్వర్గీయ డా. నేమాని నాగేంద్రరావు(ఎకనమిక్స్)
(Late) sri koripalle Subbarao, Rtd.Lecturer
స్వర్గీయ ఎస్. ఉమామహేశ్వర రావు(కెమిస్ట్రీ)
---------------------------
మునసబు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ..
VSM College President&Correspondent
Sri Sathyanarayan Rao. M.V.V
College president&Correspondent
Sri Sathyanarayan Rao. M.V.V,
Dr.Putta Veerraju (Head, Botany PG Dept.)
******************************************************
శ్రీవుండవిల్లి సత్యనారాయణ మూర్తి షష్టిపూర్తి సన్మాన సంచిక-1976
శ్రీ వుండవిల్లి
సత్యనారాయణ మూర్తి
షష్టిపూర్తి సన్మాన సంచిక
1976
ప్రచురణ : షష్ట్యబ్ధ్యుత్సవ ఆహ్వాన సంఘము
పర్యవేక్షణ: డాక్టర్ గరిగిపాటి రుద్రయ్య చౌదరి
రామచంద్రపురం
26-4-1976
...........................................
నెనరు
శ్రీ మునసబుగారి ఔన్నత్యాన్ని తెలియజేయటానికి సరిపడ్డ సమాచారం లేకపోవటం ఒకపెద్ద లోపంగా షష్టిపూర్తి సన్మానసంఘం భావించింది. కనీసం షష్టిపూర్తి సందర్భంలోనైనా యీ లోపం కొంత పూరించాలని, అందుకుగాను ఒక సావనీరు ప్రచురించాలని నిర్ణయించారు. ఈసందర్భంలో ఎన్నో సాధకబాధకాలు వచ్చాయి. ముఖ్యంగా "రికార్డెడ్ ఎవిడెన్స్" చాల తక్కువగా దొరికింది. ఫొటోలు లేవు.ఎప్పుడో చేసిన పనుల చాయా చిత్రాలు ఈ రోజున తీస్తే పోలికలలో కొంతఎబ్బెట్టుతనమున్నా తప్పలేదు. శ్రీ మునసబుగారి కుటుంబ విశేషాలకు సంబంధించిన చాయాచిత్రాలుకూడ కావలసినన్ని లేవు. వాటిని భర్తీ చేయటానికి యిప్పటి వారి ఫొటోలు తీసినా లోటు లోటుగానే ఉండిపోయింది. శ్రీ మునసబుగారి బాల్యం గురించి, సంచికకు ఒతరువాత అనెక విషయాలలో ఆయన పాత్ర గురించి ఫొటోలుగాని, పత్రికా వార్తలుగాని ఏమీ లభ్యంకాకపోవటం మరో పెద్ద సమస్య అయింది. ఇన్ని యిబ్బందులున్నా,ఉన్న సమయంచాల తక్కువే అయినా, మా సావనీరు కమిటీ సభ్యులు ఎంతో శ్రమపడి యీక రూపు తేవటానికి సహాయపడ్డారు.
ఈసందర్భంలో మాకు ప్రకటనలు యిచ్చి ఆర్ధికసహాయంచేసిన అనేకమంది శ్రీ మునసబుగారి అభిమానుల్ని, మా సమ్మానసంఘంవారిని అభినందిస్తున్నాను. అభినందనులు, వ్యాసాలను అందచేసిన పెద్దలకు, మిత్రులకు నా కృతజ్ఞతలు..
ఈసంచిక ఈవిధంగా రావటానికి, ఫొటోలు తీయించటానికి నిర్విరామంగా తిరిగిన మా సహాధ్యాయి శ్రీ గారపాటి సత్తిరాజుగార్కి, మిత్రుడు శ్రీ మంతెన అచ్యుతరామరాజుగారికి, ఫొటోలు విసుగులేకుండా తీసినవే తీయవలసివచ్చినా శ్రమపడి తీసి, ఈసంచికకు ఒక కళాత్మక రూపాన్ని తేవటానికి ఎనలేని కృషిచేసిన మా సహాధ్యాయులు శ్రీ మన్నె వెంకట కృష్ణయ్యగారికి, అదేవిధంగా యీ సంచిక కవరుపేజీ నుండి, ప్రూఫురీడింగు, బైండింగు వరకు గుంటూరు, విజయవాడలలో వుండి ఎంతో శ్రమకోర్చి పనిచేసిన నా సహాధ్యాయులు శ్రీ కొత్త కమలాకరము గారికి,శ్రీజాస్తి దుర్గాప్రసాదుగారికి, శ్రీకోడూరి రామకృష్ణ ప్రసాదుగారికి, ఈసంచికలోని వ్యాసాలను సరిచూసిన నా సహాధ్యాయులు శ్రీ నల్లమిల్లి బాపిరెడ్డిగారికి, శ్రీ నెలకుదిటి వెంకట సుబ్బారావుగారికి, నా ప్రత్యేక కృతజ్ఞతలుతెలియచేస్తున్నాను.
ఈ సంచికలోని అనేక ఫొటోలను దయతో ఇచ్చిన శ్రీ మునసబుగారి మిత్రులకు,బంధువులకు,..వ్యాపారంతో నిమిత్తం గాకుండా,ఈ సంచికను ముద్రించటానికి మిత్రులుగా సహాయపడ్డ ఉషఃశ్రీ ప్రింటర్సు వారికి, కవరు పేజి తయారు చేసిన శాంతి ఆర్ట్స్, గుంటూరు వారికి, నా ప్రత్యేక కృతజ్ఞతలు.
ముఖ్యంగా ఈ సంచికకు ఆర్ధిక వనరులు సమకూర్చటంలో ఎంతో శ్రమపడిన నా సహాధ్యాయులు డాక్టర్ గాడేపల్లి గోపాలకృష్ణగారికి, మిత్రులు శ్రీ రిమ్మలపూడి వెంకటరావు గారికి, ఈ సంచికకు సమాచారాన్ని పంపటానికి సహాయపడ్డ మా కళాశాల ఆఫీసు సిబ్బందికి, సూపరెంటెండెంటు శ్రీ మొక్కపాటి సుబ్బారావు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
డాక్టర్ జి రుద్రయ్య చౌదరి
అద్యక్షులు..సావనీర్ కమిటీ.
* * *
శ్రీ వుండవిల్లి సత్యనారాయణమూర్తి షష్టిపూర్తి
ఉత్సవ ఆహ్వాన సంఘము
అద్యక్షులు : శ్రీ కె.వి.ఆర్. చౌదరి
కార్యదర్శి : డాక్టర్ జి.రుద్రయ్య చౌదరి
కోశాధికారి : శ్రీ పడాల అమ్మిరెడ్డి
ఊపాద్యక్షులు 1.. శ్రీ వేగుళ్ళ వీర్రాజు
2.. శ్రీ వి.రామకృష్ణ చౌదరి
3.. శ్రీ సంగీత వెంకటరెడ్డి
4.. శ్రీ కొండపల్లి కృష్ణమూర్తి
5.. శ్రీ ఏలేటి నారాయణ మూర్తి
6.. శ్రీ సత్తి సత్తిరాజు
సభ్యులు : 1.. శ్రీ గన్ని సత్యనారాయణ (చిన్నబ్బాయి)
2.. శ్రీ వి.వి. భద్ధిర్రాజు
3.. శ్రీ జి.వి.వి.సత్యనారాయణ (అబ్బు)
4.. శ్రీ కొప్పాక రామకృష్ణ
5.. శ్రీ మల్లిపూడి వెంకటరావు
శ్రీ వుండవిల్లి సత్యనారాయణమూర్తి షష్టిపూర్తి
సన్మాన సంచిక కార్యవర్గము
1. డాక్టర్ జి.రుద్రయ్య చౌదరి ..........అద్యక్షులు
2. శ్రీ కొప్పాక రామకృష్ణ .............కాకినాడ
3. శ్రీ జి.జి.రామారావు చౌదరి..........రాయవరం
4. శ్రీ గరిగిపాటి సూర్యనారాయణ మూర్తి......రామచంద్రపురం
5. శ్రీ వాలిన సూర్యభాస్కరరావు.........ఏడిద
6. శ్రీ పడాల రామకృష్ణారెడ్డి............పందలపాక
7. శ్రీ తాడి ధర్మారెడ్డి................వెదురుపాక
8. శ్రీ యమ్.ముసలయ్య చౌదరి..........వెదురుపాక
9. శ్రీ కర్రి వెంకట రెడ్డి................పసలపూడి
10. శ్రీ సత్తి గంగరాజు................మహేంద్రవాడ
11. శ్రీ చోడె జానకిరామారావు...........ఇప్పనపాడు
12. శ్రీ పిల్లా జానకిరామయ్య...........రామచంద్రపురం
13. శ్రీ కె.సూర్యనారాయణమూర్తి.......మండపేట
14. శ్రీ యమ్. అచ్యుతరామరాజు......రాయవరం
15. శ్రీ కె.ఆర్.కె. ప్రసాద్..........రామచంద్రపురం
16. శ్రీ యమ్.వి.కృష్ణయ్య..........రామచంద్రపురం
17. శ్రీ యన్. బాపిరెడ్డి............రామచంద్రపురం
18. శ్రీ యన్.వి.సుబ్బారావు........రామచంద్రపురం
19. డా.జి. గోపాలకృష్ణ...........రామచంద్రపురం
20. శ్రీ జి.సత్తిరాజు..............రామచంద్రపురం
21. శ్రీ కొత్త కమలాకరం............రామచంద్రపురం
......................................
షష్ట్యబ్ద్యుత్సవ సభా విశేషాలు -
శ్రి వుండవిల్లి సత్యనారాయణ మూర్తిగారికి
షష్టిపూర్తి ఉత్సవ సమయమున
సమర్పించిన
సమ్మాన పత్రము
మహామనీషీ!
స్వాతంత్ర్య సంగ్రామంలో గాంధీజీవలన ఉత్తేజితులైన ఆదర్శమూర్తులు..క్రమశిక్షణ ఉగ్గుబాలతో నేర్చిన కార్యదక్షులు..రాజకీయ రంగమున ప్రజాసేవాసక్తి తప్ప, పదవీరక్తిఎరుగని మహా నాయకులు..మీరు పొందలేని ఉన్నత విద్యను మీప్రజలకు అందింప కంకణం కట్టిన విజ్ఞాన సంపన్నులు..అయిన మీకు అగ్రనాయకుల ఆశీస్సులతో అభిమానుల అభినందనలతో షష్టిపూర్తి ఉత్సవమును అశేష ప్రజావాహిని జరుపుకొనుట ముదావహం. అట్టి మహావ్యక్తులయిన మీకు ఇవే మా అభివందనములు..అభినందనలు.
విద్యాపోషకా!
ప్రపంచమనే విద్యాలయములో, విద్యావిజ్ఞానాలను ఆచరణలో అందుకొన్న ఉన్నత సంస్కార సంపన్నులు మీరు. ప్రాధమికవిద్య మొదలు, అత్యున్నత విద్యవరకు ఎన్నో విద్యాలయాల్ని స్థాపించి, పోషించి,వాటిని రమ్యంగా తీర్చిదిద్ది, విద్యాభివృద్ధికి ఎడతెగకుండా పాటుపడుతున్న కృషీవలా! మీకు ఇవే మా కృతజ్ఞతా పూర్వక నమస్క్రృతులు.
ఉపాధ్యాయ బంధూ!
ఉపాధ్యాయులయెడ మీరు చూపుతున్న అభిమాన వాత్సల్యములు మరువలేనివి. ఉపాధ్యాయులను- ఉపాధ్యాయులుగా గౌరవించిన ఘనత మీది. వారి ఉమ్మడి శ్రేయస్సే కళాశాల శ్రేయస్సుగా, వారి ఉజ్వల భవిష్యత్తే కళాశాల భవిష్యత్తుగా పరిగణించు ఉపాధ్యాయ బంధువులు మీరు.అనుబంధ కళాశాలాధ్యాపకుల క్రీడలకు ప్రధాన పోషకత్వ భారము మీరు స్వీకరించుట అధ్యాపక లోకంపై మీకున్న అవ్యాజాభిమానానికి ప్రతీక. అట్టి ఉపాధ్యాయ బంధువులైన మీకు ఇవే మా వినయ పూర్వక సుమః సుమాంజలులు.
రైతుబిడ్డా!
డిగ్రీచదువులు లేకున్నా, ధనసంపద ఉన్నా లేకున్నా,పెద్ద పదవులు అలంకరించినా, అలంకరించకపోయినా.. మీత్యాగాలు, మీ షష్టిపూర్తి ఉత్సవ సమయమునదృఢసంకల్పము,కార్యదీక్ష, చిత్తశుద్ధి..చిరకాలము మీరు గుర్తింపబడటానికి, రాణించటానికి, కీర్తింపబడటానికి,అండగానుండి, కొండంత బలాన్ని ఇస్తాయి.అట్టి మహోన్నత వ్యక్తులయిన మీకు షష్టిపూర్తి ఉత్సవ సందర్భ గౌరవాభి వందములు..
మీకు పరమేశ్వరుడు ఆయురారోగ్య సంపదలు- ఉన్నతిని ప్రసాదింప ప్రార్ధించుచున్నాము.
ఇట్లు వి.యస్. యం. కళాశాల సిబ్బందిరామచంద్రపురము ,
26-4-1976
రచన: కొత్త కమలాకరము
********************************************** ప్రముఖుల సందేశాలు....క్లుప్తంగా.....కొన్ని:
మా మునసబుగారు..
అనపర్తి గణేశ్వరరావు,ఎం.ఎస్సి;
ప్రిన్సిపల్(పూర్వ),వి.ఎస్.ఎం.కాలేజి, రామచంద్రపురం.
మా మునసబుగారు ప్రజల మనిషి. ప్రజల కష్టసుఖాలు ఆయనకనుభవైకవేద్యాలు. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం, వాళ్ళకు సాయపడటం ఆయనకి వెన్నతోపెట్టిన విద్య. ఆయన నాయకత్వం బలమైన పునాదులతో ప్రజల హృదయసీమల్లో సుప్రతిషితమైంది. ప్రజలు ఆయన్ని తమ వాడుగా భావించుకొంటారు.
మా మునసబుగారిది కార్యాచరణ మార్గం. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టే స్వభావం. కార్యాచరణంలో పట్టుదల, తీవ్రత, ఆయన విలక్షణ లక్షణాలు. తలపెట్టింది పట్టుదలతో సాధించడం, ఆ సాధించడంలో తీవ్ర గమనం ఆయన పద్దతులు. ఆయన నడకలాగే, కార్యసాధనలో ఆయన తీవ్ర గమనాన్ని ప్రక్కవాళ్ళు అందుకోగలగడం కష్టం. ఆయనలో వున్న ఆ ‘డైనమిజమ్’ ఆయన మహానాయకత్వ లక్షణంగా నేను భావిస్తాను.
మా మునసబుగారి మహోన్నత వ్యక్తిత్వానికి కార్యదక్షతకి మా కళాశాల మహోన్నత భవనాలు ప్రతీకలుగా నిలుస్తాయి. అతి స్వల్ప కాలంలో యింత మహోన్నత నిర్మాణం వారి తీవ్ర కార్యాచరణకి సూచికగా మనసులకెక్కుతుంది.
మా మునసబుగారికి జరిగే షష్టిపూర్తి ఉత్సవాన్ని యీప్రాంత ప్రజలు తమ పండుగగా జరుపుకుంటారు. ఆయన కీర్తి కిరీటాలయిన తుల్యభాగా లిఫ్ట్ యిరిగేషన్, హరిజన గృహకల్పనం, సహకార సంఘాలు, ఉన్నత పాఠశాలలనుండి మహోన్నత కళాశాలా నిర్మాణం - వీటన్నిటివల్లగాని, వీటిలో యే ఒక్క దానివల్లగాని లాభం పొందని వాళ్ళు, వీటి ప్రభావ ప్రభావితులు కానివాళ్ళు యీ ప్రాంతాల ఒక్కరుకూడ ఉండరు అనడం సహజోక్తేకాని అత్యుక్తి కాబోదు. తన మహోన్నత వ్యక్తిత్వంవల్ల యీ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం, ప్రకాశితం చేసిన మా మునసబు గారికి జరుగుతున్న షష్టిపూర్తి సన్మానోత్సవం శుభప్రదం, విజయవంతం కావాలని, వారి ప్రజాసేవా జీవితం నిరాటంకమై, అమేయమై, అసమానమై ప్రకాశించాలనీ, వారికి దైవం దీర్ఘాయురారోగ్య సంపదైశ్వర్యాల్ని, ఉన్నతిన ప్రసాదించాలని పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
*****************************************************
L. Bullayya
(Ex) Vice - Chancellor, Andhra University
............He is known to all of us as " Rayavaram Munsiff " and i wonder how many people know his real name! He has been in the field of politics for a long time and was also a Legislator for some time.
Though a rich by birth, for some reason he did not have an opportunity to go to college or university, but he is endowed a rare gift known as commonsense which many and educated men lack. This of men and matters enabled him to carry on his responsibilities as district leader.
What strikes one most is his keen interest he evinced in higher education not for himself, not for his children but for all boys and girls in and around Ramachandrapuram.He felt the need for a college in that thickly populated area. Unlike the management of colleges elsewhere who could not provide minimum physical requirement to colleges started by them , Sri Munsiff garu rose up to the occasion and showed a tremendous will in organising the V.S.M. College almost single handed with the help of the local people large amounts of donation were collected for the noble cause and within a short span of time a huge building programme was taken up and completed. This is not a small achievement. Sri Munsiff was able to provide one of the finest educational institutions in the state. All those interested in higher education should be grateful to Sri Munsiff for his foresight in creating this magnificent institution........
-L. Bullayya
*******************************************************
P.Sriramam, M.A,B.Ed;(APES)
First Prinncipal of V.S.M. College
As one coming from an agricultural family in the rural areas of Ramachandrapuram taluk of East Godavari District, Sri Vundavilli Satyanarayanamurty garu is a typical representative of rural folk whose actual needs and problems he had understood thoroughly and whose cause he had taken up even from the beginingof his public career. Though Sri Satyanarayanamurty garu is devoid of the advantages of a formal training and education, he possesses a sound and shrewed commensense with a knack of understanding men and this easily. He is neither a dreamer nor a sentimentalist, but is essentially a man of action and ahard realiest. His indefatigable energy, unbounded self confidence and tenacity of purpose enabled him to hold several responsible positions in public life including the membreship of the Legislative council in the state of Andhra Predesh. He is an incorrigiable optimist and stands like a rock against all currents and cross currents of public life. He is easily accessible to one and all and extends a patient and sympathetic hearing to their representations exploring the possibilities for such help and assistance as he could promptly render. Inspite of his seemingly stern exterior, he is full of the milk of human kindness.
The establishment of a first grade Science and Arts College in Ramachandrapuram in June 1966 which had been a long-felt need of the people of that area is his crowning achievement. He was good enough to invite me to take over the Principalship of the new college in which capacity i had the opportunity of working with him for two years fro June 1966 to Jjuly 1968 during which period i humbly endeavoured to serve the infant institution to the best of my ability by laying sound traditions in respect of academic standards and general discipline. Sri Vundavilli Satyanarayanamurty garu in his capacity as the President of the college Managing committee treated me with utmost respect, giving due weight to all proposals and suggestions made by me for the successful and efficient running of the institution.
His ambition has always been to make his college as one of the biggest and the best in Andhra. With all his drive and dynamism, he set out initiating appropriate steps for the construction of spacious and imposing buildings for the college, and completed the project in a record time. I have always felt that strong will to achieve something landable will of its own accord find appropriate ways and means of attaing the objective; Hence it is hoped that the college founded by Sri Vundavilli Satyanarayanamurty garu will add dimension upon and continue to serve the cause of higher education in accordance with the highest ideals of discipline, enlightenment and learning.
- P. Sriramam
*************************************************************************************
రాయవరం మునసబుగారు
రావు గోపాలరావు
రాజ్యసభ మాజి సభ్యుడు, ప్రముఖ సినీ నటుడు.
కొందరికి క్రికెట్ ఆట అంటే సరదా.. మరికొందరికి పేకాటన్నా, కోడిపందాలన్నా-గుర్రప్పందేలన్నా- సరదా.. రాయవరం మునసబుగార్కి యీ సరదాలేమీ లేవు..ఆయనకున్న ఒకే ఒకసరదా .. ఎలక్షన్లు. చాలామంది రాజకీయ నాయకులు ఎలక్షన్లంటే భయపడతారు. కాని మునసబుగారంటే ఎలక్షన్సే భయపడతాయనివిన్నాం.. ఎందుకంటే ఎలక్షన్సులో ఆయన స్పీడు-ప్రత్యర్ధులులేకాదు, స్వజనంకూడా తట్టుకోవడం కష్టం.
ఆయనకు రాజకీయమంటే ఒక చదరంగం.. ఆయన వేసే ఎత్తులు, ప్రత్యర్ధుల్ని చేసే చిత్తులు, భలే గమ్మత్తుగా వుంటాయి- ఆయన మంత్రిచేత రాజును బంధించడం ప్రజ్ఞగా భావించరు. బంటు చేతిలో మంత్రి దెబ్బతినడం- శకటు సాయంతో రాజు ఆట కట్టించడం - ఆయన ప్రజ్ఞగా భావిస్తారు.
తూర్పు గోదావరిజిల్లా రాజకీయ చదరంగంలో- ముప్ఫై సంవత్సరాలుగా ఆయనదే పైచేయి.. అప్పుడప్పుడూ, ఆట తప్పటడుగుపడ్డా ఆయన బాధ పడరు...గెలుపు- ఓటమి,రెంటినీ చిరునవ్వుతో స్వీకరించే స్వభావ మాయనది.. యుద్ధంలో వెన్ను చూపడంకంటె-రాజకీయాల్లో వెన్ను చూపించడం హీనాతిహీనమని ఆయన నమ్మకం. రాజకీయనాయకుని జీవితం- నేలమీదపడ్డ మట్టిపాత్ర కాకూడదు- రబ్బరుబంతి కావాలని ఒక మహా నాయకుని ఉవాచ. అదే మునసబుగారి విశ్వాసం.. ఆయన రాజకీయ జీవితం..అందుకే ఆయన్ను పవర్ పొలిటీషియన్ గా ఎవరూ భావింపరు..పవర్ఫుల్ పొలిటీషియన్ గానే ప్రజలు, రాష్ట్ర నాయకులు గౌరవిస్తారు.
ఆయన ఏ కాలేజీలోనూ చదవక పోయినా, ఎందరో మనుషుల జీవితాలను కూలంకషంగా చదివినవారు.. కాలేజి విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించినవారు...ఎన్నో బృహత్తర. ప్రజాహిత కార్యక్రమాలను- ఏకవ్యక్తిగా, స్వశక్తితో సాధించినవారు..
రాజకీయ నాయకుల్లో అరుదుగా కనిపించే ఒక ప్రత్యేకత మునసబుగారిలో చూస్తాం..అదేమిటంటే ఆయనకు జాతి, కుల, మత విభేదాలు లేకపోవడం..అన్ని ‘ఇజాల’లోకి ‘కమ్యూనలిజం’ భయంకర శత్రువని ఆయన అభిప్రాయం..ఆయన్ను అభిమానించే వారు స్వకులంలో కంటే- యితర కులాల్లోనే ఎక్కువగా వుండటం, ఆయనలోని ఆదర్శనీయమైన ప్రత్యేకత...మునసబుగారికి ఎన్నో పదవులు రావచ్చు..పోవచ్చు..కాని, ఆయనకు తిరుగులేని శాశ్వతమైన పదవి ఒక్కటే..అదే "రాయవరం మునసబు"- అది ఆయనకు దేవుడిచ్చిన వరం.. లక్షలాది ప్రజలు ప్రేమానురాగాలతో-గౌరవించే పెద్ద బిరుదు..
అరవై సంవత్సరాలు జీవించినందుకు షష్టిపూర్తి జరుపుకోవడం పరిపాటి... కాని, కాలాన్ని విలువైనదిగా భావించి, అర్ధవంతంగా ఆదర్శవంతంగా జీవించి, సమర్ధవంతునిగా రాణించి, అనేకానేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించి, షష్టిపూర్తి ఉత్సవం- గర్వంగా, నేత్రపర్వంగాజరుపుకుంటున్న శుభసందర్భంలో- ఆ మనీషిని ప్రజలందరితోబాటు "శతమానం భవతి" అని ఆ జిల్లా వాసిగా, నేనూ కోరుకుంటున్నాను.
శలవు,
రావు గోపాలరావు
************************************************************
పి. గోపి
సినీ రచయిత
మంచివాళ్ళమనుకునే వాళ్ళకి ఈయన చాలామందికి చెడ్డవాడు కావచ్చు. ఎందరో చెడిపోయిన వాళ్ళకి మాత్రం మంచివాడని నాకర్ధమైంది. వ్యంగ్యం కాదు..ఆయన కట్టిన కాలేజి యిలా వ్రాయిస్తోంది. ఆయన చదువుని ప్రేమించగలడో లేదో తెలియదు..కాని చదువుకుని పైకి రావలసిన పిల్లల్ని ప్రేమిస్తారన్నది నిజం!
ఒకో మనిషి వుంటాడు. అతణ్ణి ప్రపంచం అంతా గొప్పవాడంటుంది..అందులో కొందరు తమకు లాభించటంకోసం అంటారు. మరి కొందరు అతణ్ణి గొప్పవాడనటంలో తమకి నష్టంలేదు కాబట్టి అంటారు.
సృష్టిలో ఒకే ఒక్క పదార్ధం వుంది..అది దర్పణం లాంటిది.. ఏమనిషి మంచిచెడుల్నైనా వున్నది వున్నట్లు నిర్భయంగా, నిర్మొహమాటంగా చూపిస్తుంది. దాని పేరు అంతరాత్మ. ఆ అద్దం ముందు నిలబడినప్పుడు భయపడకుండా, పశ్చాత్తాపపడే అవసరం రాకుండా ఎవరు బ్రతగ్గలరో వాళ్ళే నిజమైన గొప్పవాళ్ళు. ఈ మనిషికి ఆ సాహసం, నైర్మల్యం ఉన్నాయని నా విశ్వా సం. ఎప్పటికీ ఉండాలని ఆకాంక్ష.
వారెవరో తెలీయకుండా వార్ని గురించి అతి కొంచెం తెలుసుకున్న..
పి. గోపి
*************************************
శుభాకాంక్షలు....
అల్లు రామలింగయ్య
సినీ ఆర్టిస్ట్
మునసబుగారితో నా పరిచయం కొద్దిపాటిదే అయినా ఆయనపట్ల నా అవగాహన పెద్దపాటిదయిందనే చెప్పవచ్చు.
మనసులో ఒకమాట పైకొకమాట అనే బాపతు వ్యక్తిత్వం కాదాయనది. ఆ అనేమాట ఏదో ముక్కుసూటిగా గట్టిగా అంటేగానీ ఆ రాత్రికి ఆయనకు నిద్రపట్టదు. పైగా ఆయనది గంభీర కంఠస్వరం. రూపంలో మాటలో చేతలో మునసబుగిరీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
సుసంపన్నమైన కుటుంబంలో జన్మించిన ఆయన సామాన్యకార్యకర్తగా కాంగ్రెస్ సంస్థకు చేసిన సేవలు; పిత్రుతుల్యు డైన నాయకుడుగా తాలూకానూ, జిల్లానూ నడిపినతీరు, సుదీర్ఘకాలం శాసనమండలి సభ్యునిగానే గాక వివిధ పదవుల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. సాంఘికాభ్యుదయ సాధనలో ఆయన సలిపిన కృషి గణనీయమైనది. ముఖ్యంగా విద్యాభివృద్ధికి ఆసక్తితో అభిరుచితితో ఆయన సాధించిన విజయాలు ప్రతివ్యక్తీ మరీ మరీ గుర్తుంచుకోతగినివి.
ఆంధ్రమాతకు అల్లారు ముద్దుబిడ్డడైన మునసబుగారి షష్టిపూర్తి వుత్సవాలసందర్భంగా ఆయన అతులిత సౌభాగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. సమర్ధవంతమైన ఆయన సారధ్యం నేడు ఎంతేని అవుసరంగనుక ఆయన సేవలు సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.
శ్రి మునసబుగారికి నా గౌరవ పురస్సర శుభాకాంక్షలు..
భవదీయుడు
అల్లు రామలింగయ్య
* * * * *
అంతులేని మనిషి
-జి.వి.వి.సత్యనారాయణ మూర్తి, ఎమ్.కాం; ఎమ్.ఎ(సైకాలజి)
రిటైర్డ్ లెక్చరర్,పత్రికాసంపాదకుడు
మీరెంతో చదువుకోలేదు
కాని ఎంతమంది మీ దగ్గర చదువుకుంటున్నారు!
మీ చదువెంత చిన్నది
అయినా ఎంత పెద్ద చదువులు చెబుతున్నారు!
మీరొక్కరే!
అయినా ఒక్కసారి వెయ్యిమందికి పైగా మీ పాఠాలు వింటున్నారు!
అప్పుడయినా కంటికి కనిపించరు
దేవుడిలా
ఇదెంత విడ్డూరం! అయినా ఎంత నిజం!
ఇది మీరు కట్టించిన దేవాలయం
దేవుడే దేవాలయాన్ని కట్టించడం
మీరు చేసిన ఓ చిత్రం! విచిత్రం!
అధ్యాపకుల్లాంటి పూజారులు,
విద్యార్ధుల్లాంటి భక్తులు
తరం తరం, నిరంతరం.
మీకీ రోజు అరవయ్యేళ్ళు
అయినా కాలంతో మీకు నిమిత్తంలేదు
గాలి, నీరు ఉన్నంతకాలం,
మీరుంటారు,
మీరు చేసిన ‘మనుషు’లుంటారు
* * *
********************************************************************************************
...........He is holding a very important place in the National Congress. He has proved to be a great source of strength to so many of our educationists. He has served to develop the rural social services in the Ramachandrapuram taluk as the chairman of the Samithi. Your college owes much to his contributions. Altogether he has proved to be a worthy public worker.
- Acarya N. G. RANGA,
Peasant Institute, Nidubrolu
********************************************************************************************
.............Sri Vundavilli Satyanarayana Murty needs no introduction to the Andhra public. He is a long-standing Congressman. In whatever walk of life he was, he created a sigular impact. The local people too bestowed on him their affection and respect. In fact, only a few leaders, like our Rayavaram stalevert, could claim complete identity with the aspirations and ambitions of the people they serve. As a Legislator, Party organisor and Founder of the college, he rendered yeomen service to the area. He was associated with me as a close colleague for a number of years. It is, therefore, in the fitness of things that his Shastipurti should be celebrated with enthusiasm.
- Kasu Brahmananda Reddi
Ex Cm, Home Minister,Govt.of India
********************************************************************************************
.......................East Godavari has a pride of place in the state. It has produced eminent sons in different fields. Sri Rayavaram Munsiff is one of them. What has made him great or what is the quality that has made so many people all over the state like him, according to me is his heart. Wherever there is suffering he is there. For anyone who is in need in the district he is available anytime. He is the darling of the masses. Wherever he is or goes you see hundreds round him. It is not given to all to be like this. It is peculiar to him.
In his multiple activities for the district the most outstanding monument he has left to the posterity is the college. His devotion and attachment to that institution is his religious belief that education alone will have permanent effect on the development of the area.
My attachment with him is more than two decades. The more i know of him the more my respect and regard grows. I wish and pray that Almighty may bless him with good health for many more years so that his services are available for the district and state.
- K. Vijaya Bhaskara Reddi
Ex Cm, AP.
Prof. K. Viswanadham
The Head of the Dept. of English (Ex)
Andhra University
..........As a member of the University Commission that visited Ramachandrapuram and later as a member of the Governing Body of the college i had opportunities of getting acquainted with Sri Vundavilli Satyanarayana Murty garu. He is an institution in himself. It is because of his drive and dynamism that the college was established and setting up a college is to release the waters of thought. He is dedicated to sowing the godcreated light of learning. The Godavari District should be more indebted to him than to the mighty Godavari; the river irrigates the fields and Sri Murty's college the minds of boys and girls.
He and his like are the salt of the earth and is because of such selfless workers that, as saying goes, rains fall at the proper time and fields yield a bumper harvest.
-K . Viswanadham
****************************************************************
...................He is a man of great public spirit and charitable disposition. If it was not for him i very much doubt the beautiful college would have ever come into existance. There are many instances where his helping hand has had to the coming many institutions......
-Jagarlamudi Chandramowli
Guntur
******************************************
...............Rayavaram Munsiff is a man of great courage. He is a Philanthropist. He has no degrees in education but gave opportunity for hundreds and thousands of votaries of knowledge. His is a great service to particularly the people of Ramachandrapuram Taluk and his institution is a great institution with all the requisite qualifications of a Citadel of Sweetness and Seminary of light. It is a great work of art. Great works are performed not only by strength but by perseverance. Let the credi go to this great man, who comes from a humble farmer's family. It is a hard-won credit of sixty years of service.......
- M. Seetha Ramayya M.A.(Phil.): M.A (Engl.)
********************************************
...........................Sri Vundavilli Satyanarayana Murty garu, in various capacities has served the people of East Godavari District. particulary, with his perseverance, devotion to duty and steadfastness and has been a source of inspiration to the younger generation ...
-Narla Tata Rao
Chairman, AP State Electricity Board (Ex)
*********************************************************
.........................The college at Ramachandrapuram which is named as V.S.M.College is a living monument for his selfless service and dedicated work to the cause of higher education in Andhra Pradesh. Sri Vundavilli Satyanarayana Murty is a remarkable person with energy. The progress achieved in East Godavari during the past three decades is largely due to his unsurpassing zeal, initiative and drive. We don't have many leaders equal in stature and calibre to Sri V. Satyanarayana Murty in East Godavari District................
-P. Jagadeswararao, M.A: LL.B:
Principal(EX)V.R.S& Y.R.N.College,Chirala
**************************************************
-తోట రామస్వామి
(మాజీ మంత్రి)
*****************************
శ్రీ వుండవిల్లి సత్యనారాయణ మూర్తి ప్రజాహిత కార్యక్రమాలలో ముఖ్యముగ రామచంద్రపురం కళాశాల నిర్మాణము, భవన నిర్మాణము అన్నవి ఆదర్శప్రాయము. శాసనపరిషత్తు సభ్యులుగా, రాయవరము పంచాయితి సమితి అద్యక్షులుగా, రామచంద్రపురం కేంద్ర సహకార బ్యాంకు అద్యక్షులుగా ప్రజలకు సేవచేసి యున్నారు....
-వావిలాల గోపాలకృష్ణయ్య
**********************************
.......విద్యావంతులైన యువకులు రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయాలస్థాయి పెంచాలని మనసారా నమ్మి ఆచరించిన మహావ్యక్తి.
మా గురువుగారు నూరేళ్ళు వర్ధిల్లి వందల వేల శిష్యుల్ని తయారుచేసి పైకి తీసుకురావాలని భగవంతుని ప్రార్ధిస్తూ...
వల్లూరి రామకృష్ణచౌదరి, శాసనసభ మాజీ సభ్యులు.
**********************************
శ్రీ మూర్తి గారిని ఆంధ్రదేశంలో ఎరుగని వారు లేరు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు వారు చేసిన సేవ ప్రాతఃస్మరణీయం. లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోశాధికారిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా వారు చేసిన ఆంధ్రదేశానికంతకూ విదితము. ఆయా సందర్భాలలో వీరితో కలిసి పనిచేసిన రోజులను నేనెన్నిడూ మర్చిపోలేను. కాగా తూర్పు గోదావరి జిల్లా పరిషత్తు ఉపాద్యక్షులుగా, రామచంద్రపురం సెంట్రల్ బ్యాంకు అద్యక్షులుగా, వి.ఎస్.ఎం .కాలేజి నిర్వాహకులుగా వారు చేసిన, చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయం.,అభినందనీయం...
-ఎం.ఆర్. అప్పారావు, ఎం.ఏ
మాజీ ఉప కులపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం.
**************************
......తన సేవలను ప్రజలకు ఉత్సాహముతో నందించుచు, తన జిల్లాలో సహకార సంఘము మున్నగు సంస్థలను జయప్రదముగ నిర్వహించిన నాయకుడు. ముఖ్యముగ రామచంద్రపురమున, తన ప్రత్యేక కృషితో, పట్టుదలతో నొక కళాశాలను నెలకొల్పి, చక్కగ దానిని నిర్వహించుచున్న దిట్ట. తాను పూనిన కార్యమును - ఎట్టికష్టనష్టముల నైనను గుఱియైసఫలవంతమొనర్చుకొనుచున్న నేర్పరి. ......
-కల్లూరి చంద్రమౌళి, బి.ఎస్సీ;(ఎబర్డీన్)
మాజీ మంత్రి
************************************
Koppaka Ramakrishna,B.Com:
Convenor- Citizens council,
Director:VBC Industries
Hon. Presitdent `VEDIKA'-kAKINADA
మరువలేని మహావ్యక్తి శ్రీ రాయవరం మునసబు గారు.
మన జీవనయానంలో ఎందరినో కలుస్తూ ఉంటాం. వారితో అనుబంధాలు పెంచుకొనేతీరులో వివిధరకాలుంటాయి. కాని నాజీవితరంగంలో ఎందరో రాజకీయ, సినిమా, సామాజిక రంగ ప్రముఖులతో పరిచయాలు అనుబంధాలు ఉన్నాయి. కానీ శ్రీ మునసబు గారితో ఉన్న అనుబంధం మరువలేనిది, విడదీయరానిది. ఆయన వ్యక్తిత్వం, ఆలోచనా, బయటతీరు మరోలా అనిపించినా, ఆయన భావాలు, ఏదో చేయాలనే తపన నాతో పంచుకొన్నారు. మాట ఎంత కఠినమో మనస్సు అంత మంచిది. ఎప్పుడు కాకినాడ వచ్చినా నన్ను కలువకుండా వెళ్ళేవారుకాదు.
ఎస్.బి.పి.బి.కె సత్యనారాయణరావు గారు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎం.ఎల్.సి గా పోటీచేయాలని ముహూర్తం పెట్టుకొని నాదగ్గరకు వచ్చారు. ఇంతలోనే శ్రీమునసబుగారూ నాదగ్గరకు వచ్చారు. సత్యనారాయణగార్ని చూపించి ఎం.ఎల్.సి గా పోటీచేస్తున్నారనీ, మీగురించే మాట్లాడుకుంటున్నాం అనీ, మీ సహకారం అర్ధిస్తున్నారని చెప్పాను. శ్రీ ఎస్.బి.పి.బి.కె, నేనూ ఎన్నో విషయాలు చెప్పాం. దేనికీ మాట్లాడకుండా మౌనం వహించారు. తిరిగివెళ్ళిపోతూ "మీరిద్దరూ రేపు రాయవరం భోజనానికి రండి" అనిచెప్పి వెళ్ళిపోయారు. తనను ప్రత్యర్ధివ్యక్తిగా భావించి మాట్లాడలేదని భావించిన శ్రీ ఎస్.బి.పి.బి.కె, ఆయన ఆహ్వానం తో పులకరించి ఎంతో ప్రశంశించారు. మర్నాడు రాయవరం వెళ్ళాక,భోజనాలయ్యాక, శ్రీ ఎస్.బి.పి.బి.కె,ను కారులో ఎక్కించుకొని రామచంద్రపురం, జి.మామడాడ, యింకా అనేక ప్రాంతాలు త్రిప్పి తనమాటగా శ్రీ ఎస్.బి.పి.బి.కె,ను గెలిపించాలని మరీ,మరీ చెప్పారు.
ఎన్.టి.రామారావుగారితో నాకుండే అనుబంధం మునసబుగారికి తెలుసు. ౧౯౮౨లో ఎన్నికలరంగంలో జిల్లా అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం బాధ్యత
ఎన్.టి.ఆర్ నాకు అప్పగించారు. జిల్లా మొత్తంలో 19 టి.డి.పి. ఎం.ఎల్.ఏలు నెగ్గారు. తరువాత జడ్.పి అద్యక్షునిపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు టి.డి.పి.కి మూడు సీట్లు తక్కువ అనిపించింది. నేను మునసబు గారి సహాయం కోరాను. ముందు మౌనం వహించి, తీర్మానంరోజు నలుగురిని తీసుకొనివచ్చి మాకు సహకరించారు. ఎన్.టి.ఆర్ మునసబుగారికి నమస్కరించాలని, ఒకసారి హైదరాబాదు తీసుకురమ్మని కోరారు. మునసబుగారు ముందు కాదన్నా, తరువాత నావెంట హైదరాబాదు వచ్చి, ఎన్.టి.ఆర్ ని కలిస్తే, ఎన్.టి.ఆర్ శ్రీ మునసబుగారిని ఎంతో కీర్తిస్తూ , ఆలింగనం చేసుకొని మాట్లాడిన విషయాలు ఎప్పటికీ మరువలేను.
అలాగే ఆయన మరణానంతరం మాస్వగ్రామం సోమేశ్వరం పంచాయతీ ఆఫీసులో ఆయన ఫొటో ఆవిష్కరణ సమావేశానికి ఎందరో ప్రముఖులు వచ్చారు. అందరికీ ఆయన ఫొటోతో ఉన్న మెమెంటోలు యిచ్చాను. యింకా మరెన్నో అనుభూతులు వ్రాయలేకపోతున్నాను..
-కొప్పాక రామకృష్ణ, కాకినాడ
1 నవంబరు 2008
(మునసబుగారిని ఎల్లవేళలా స్మరించి, అభిమానించే వారిలో ముఖ్యులైన శ్రీ రామకృష్ణ గారిని.. నాలుగు మాటలు వ్రాయమని ఫోనులో కోరినవెంటనే ...ఆరోగ్యం బాగులేకపోయినా...జ్ఞాపకాలు పంపించారు..ఎన్నో ఉన్నా.."చేయి" వ్రాయడానికి సహకరించక వ్రాయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు..ఆ మహానుభావునితో తన అనుబంధం విడదీయలేనిదని...ఆయన్ని గుర్తుచేసుకున్నారు..మునసబుగారు లేని లోటు ఎప్పటికీ, ఎవరూ తీర్చలేరంటూ..కన్నీళ్ళతో అంజలి ఘటించారు శ్రీ రామకృష్ణ గారు..ఈనాప్రయత్నాన్ని అభినందించారు.- కమలాకరం కొత్త )
**********************************************
శ్రీ వుండవిల్లి సత్యనారాయణమూర్తి గారి
పందొమ్మిదవ వర్ధంతి (19)
వి.ఎస్.ఎం. కళాశాలలో..
6-11-2008
శ్రద్ధాంజలి ఘటిస్తున్న రాష్ట్రమంత్రివర్యులు శ్రీ పిల్లి సుభాస్ చంద్రబోస్
శ్రద్ధాంజలి ఘటిస్తున్న మునసబు గారి భార్య శ్రీమతి రామతులశమ్మ
వివిధ కార్యక్రమాలలో మునసబుగారు..
No comments:
Post a Comment